D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ జనవరి 10 (అక్షరం న్యూస్) రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. శనివారం ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారి ధర్మపురి జగదీష్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రత మహోత్సవాలు పై అవగాహన కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టిఏ బోర్డు గజ్జెల్లి వెంకన్న, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ లు దినేష్, స్పాట్కస్ తదితరులు ఉన్నారు.
.
Aksharam Telugu Daily