GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /అక్టోబర్ -31(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండల కేంద్రం లో శుక్రవారం ఉదయం 2కే రన్ నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో భాగంగా ముస్తాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన నిర్వహించిన 2కే రన్‌ను స్థానిక ఎస్ ఐ గణేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో ఇందులో చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్థానిక మేజర్ గ్రామ పంచాయతీ నుండి ప్రారంభమైన రన్ ఏ ఎం ఆర్ గార్డెన్ వరకు సాగింది.ఈ సందర్బంగా ఎస్ ఐ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ సమగ్రతకు నిలువెత్తు రూపమన్నారు. స్వతంత్ర భారతదేశ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. వందలాది స్వదేశీ సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి, దేశాన్ని ఒకే తాటిపైకి తీసుకురావడంలో ఆయన అచంచలమైన కృషి, అకుంఠిత దీక్ష ఎప్పటికీ మరువలేనివన్నారు. పటేల్ దార్శనికత, రాజనీతిజ్ఞత కారణంగానే నేడు మనం చూస్తున్న సమగ్ర భారతదేశం సాధ్యమైందని వెల్లడించారు. ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడు మాత్రమే కాదని, దేశభక్తికి, త్యాగం, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనమని, ప్రజలందరినీ ఐక్యంగా ఉంచాలనే ఆయన ఆశయం నేటికీ మనందరికీ స్ఫూర్తినిస్తుందని చెప్పారు. ‘రన్ ఫర్ యూనిటీ’ ద్వారా సర్దార్ పటేల్ ఆశయాలను స్మరించుకుంటూ, మన దేశ సమగ్రతను, ఐక్యతను పెంపొందించాల్సిన అవసరాన్ని గుర్తుచేసుకుందామని తెలిపారు. ఈ రన్‌లో పాల్గొనడం ద్వారా, మనం సర్దార్ పటేల్ వారసత్వాన్ని గౌరవించడమే కాకుండా, భవిష్యత్ తరాలకు ఐక్యతా సందేశాన్ని అందిద్దామని పేర్కొన్నారు. అనంతరం పలువురు రాజకీయ యువ నాయకులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉదయం నడక అల వాటు చేసుకోవాలని ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో తోడ్పాడుతుందని తెలిపారు. యోగ, వ్యాయామం చేయడంవల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. అనంతరం గెలుపొందిన వారికి బహుమతులు అందచేశారు ఈ కార్యక్రమంలో స్థానికులు, క్రీడాకారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily