Friday, 24 July 2026 05:45:26 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రాఘవేంద్ర పాఠశాల లో వేడుకగా బోనాల సంబురాలు..

.


GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLA

Reporter

Date : 09 July 2025 10:54 AM Views : 1329

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -08(అక్షరం న్యూస్ ) తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన బోనాల సంబురాన్ని ముస్తాబాద్ మండలంలోని రాఘవేంద్ర పాఠశాల విద్యార్ధులు, ఉపాధ్యాయులు బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా విద్యార్థినులు తెలంగాణ సంప్రదాయ దుస్తులు ధరించి బోనం ఎత్తుకుని పాఠశాలకు చేరుకున్నారు. విద్యార్థులు పో తరాజు వేషధారణతో విన్యాసాలను చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారుబోనాలు నెత్తిన పెట్టుకొని పురవీధులలో ప్రదర్శనగా పుర విధుల గుండా చేరుకున్నారు. పాఠశాల విద్యార్థులు పోతురాజు వేషధారణలో ప్రత్యేక అలంకరణతో చేతిలో చండ్రకోల పట్టుకొని బోనాల ప్రదర్శనకు ముందు నడిచారు. సాంప్రదాయ దుస్తుల్లో బోనాలతో ఉన్న విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయినీలు అమ్మవారికి బోనాలను ఎత్తుకున్నారు.. బోనాలు నెత్తిన పెట్టుకున్న ఉపాధ్యాయినీలు ప్రదర్శనలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేకంగా బోనాలు సమర్పించారు.ఈ సందర్బంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ పాఠశాలల్లో బోనాల పండుగ జరుపుకోవడం ద్వారా విద్యార్థులు సాంప్రదాయాలు, ఆచారాలను తెలుసుకుంటారని,తెలిపారు తెలంగాణ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది బోనాల పండుగ అని, ఈ పండుగకు చాలా ప్రాముఖ్యత ఉన్నదని పేర్కొన్నారు. ఆషాడ మాసం బోనాల పండుగ సందర్భంగా పాఠశాలలో బోనాల పండుగ నిర్వహించినట్లుతెలిపారు ఈ సందర్భంగా పాఠశాల చిన్నారుల వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం లో కరస్పాండెంట్ నరేష్ ప్రధానోపాధ్యాయులు మంజుల, ఉపాధ్యాయినీలు అపర్ణ, బాను, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :