AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / మేడ్చల్/ కుత్బుల్లాపూర్ : : * అక్షరం ప్రతినిధి మల్కాజిగిరి విషయం : విద్యారంగంపై ప్రభుత్వాలు ఎందుకంత నిర్లక్ష్యం వహిస్తున్నాయని యుఎస్ఎఫ్ఐ మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు ఎం. చంద్రకాంత్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన ఒక పత్రిక ప్రకటనలో మాట్లాడుతూ "రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక వసతులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయడం లేదు. ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు సకాలంలో విడుదల చేయకపోవడంతో పేద విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది" అని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. "గత బడ్జెట్లలో విద్యారంగానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఈసారి బడ్జెట్ లో విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించి, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. లేనిపక్షంలో యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని" హెచ్చరించారు.
.
Aksharam Telugu Daily