D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం /తల్లాడ టౌన్ సెప్టెంబర్ 30 (అక్షరం న్యూస్) తల్లాడ: మంగాపురం కొత్తగూడెం సిఈఆర్ క్లబ్ లో రాష్ట్రస్థాయి రెజ్లింగ్ ఎంపికల పోటీలు అండర్ 14, అండర్ 17 బాల బాలికలకు నిర్వహించారు. ఈ పోటీలలో తల్లాడ ఫ్యూచర్ జెన్ స్కూల్ విద్యార్థులు ప్రతిభను కనబరచి అండర్ 14 బాలుర విభాగం నుండి సుమిత్ జాట్ 67 కెజీ అండర్ 17 విభాగం నుండి జి. మహేంద్ర కుమార్ 80 కెజి ఎస్. నాగ ఉదయ్ జస్వంత్ 46kg రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికైనారు. ఎంపికైన విద్యార్థులను,పి ఈ టి జవ్వాజి.దిలీప్ కుమార్ ను స్కూల్ కరస్పాండెంట్ శ్రీమతి వీరంకి సబిత అభినందించి, రాష్ట్రస్థాయిలో కూడా రాణించి పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ అభినందన కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్, కోఆర్డినేటర్, ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily