D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం టౌన్ /నవంబర్ 4 (అక్షరం న్యూస్) క్రైస్తవ యువ మహిళలపై జరిగిన దాడి హేయమైన చర్యా అని , క్రైస్తవ సంఘ ప్రతినిధులు బుధవారం ఖమ్మంలో సమావేశమై తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాదులోని అల్మాస్గూడ ప్రాంతంలో ఆదివారం ఇద్దరు యువ మహిళలను అసభ్య పదజాలంతో తీవ్రంగా కొట్టినటువంటి సంఘటన ను ఖమ్మం జిల్లా క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ దాడి చేసన వ్యక్తిని చట్టరీత్యా కఠినంగా శిక్షించాలని తీర్మానం చేయడమైనది ఇలాంటి దాడులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా వ్యక్తిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ మధ్యకాలంలో రాజ్యాంగపరమైన హక్కులను కూడా ఉల్లంఘిస్తూ చట్టాన్ని తమ చేతులకు తీసుకొని దుశ్చర్యలకు పాల్పడుతున్న అల్లరిమోకులను అరికట్టాలని పోలీస్ శాఖ వారిని విజ్ఞప్తి చేశారు.వీధిలో తిరిగిన గృహాలు వెళ్లిన ఎవరినైనా మందలించిన మతోన్మాదులు ఉగ్రవాదుల్లాగా ప్రవర్తించడమనేది శోచనీయం అని అన్నారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సమాజంతో పాటు మానవీయ దృక్పథంతో అన్ని సంఘాల వాళ్ళు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తూ ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని కోరారు. ముఖ్యంగా తుంపాల కృష్ణమోహన్ అధ్యక్షతన వర్కింగ్ ప్రెసిడెంట్ ఆనంద్ బాబు ఆధ్వర్యంలో ప్రింటింగ్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సాక్షిగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి క్రిస్టియన్ జాయింట్ ఆక్షన్ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నము జిల్లా ఫీజు కమిటీ చైర్మన్, అధికార ప్రతినిధి తిమోతి , జిల్లా కార్పొరేషన్ కన్వీనర్ మాచర్ల శేఖర్ బాబు , జిల్లా నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సంతోష్ , సమన్వయకర్తలు ఎర్నెస్ట్ పాల్ , నందిపేట అభిషేక్ , ముఖ్య సలహాదారు నూతన్ కుమార్ నియోజకవర్గ అధ్యక్షులు అంతోటి జగన్, ఖమ్మం ప్రశాంత్ అత్యవసర సమావేశం నిర్వహించి తీవ్రంగా ఖండించారు.
.
Aksharam Telugu Daily