D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * * *ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్/తల్లాడ నవంబర్ 7 (అక్షరంన్యూస్)* కలెక్టర్ గారు అక్రమ పత్తి కొనుగోళ్లపై కన్ను వేయండి నోటీసులు ఇచ్చి కాసులు లెక్కబెడుతున్న అధికారులు ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతున్న పట్టించుకోని వైరా మార్కెట్ కమిటీ అధికారులు తీరులపై రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రంలో ప్రభుత్వం సీసీఐ పత్తి కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయినా సీసీఐకి రాకుండా రైతులు దళారులను ఆశ్రయించి నష్టపోతున్న వైరా మార్కెట్ అధికారులు స్పందించడంలో విప్లమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. అక్రమ కనుగోలు కేంద్రాలపై కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలకు స్పందించిన మార్కెట్ అధికారులు అక్రమ పత్తి వ్యాపారులకు నోటీసులు ఇచ్చిన మారని తీరుపై వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ సీసీఐ వారి ఆధ్వర్యంలో అక్రమ పత్తి కొనుగోలు వారికి లైసెన్సులు తీసుకుని వ్యాపారాలు చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచాలని లేనిపక్షంలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించిన మారని అక్రమ పత్తి కొనుగోలుదారులు తీరు.. అధికారుల అండదండలతో అక్రమ పత్తి కొనుగోళ్ల కేంద్రాలు ఏర్పాటు చేసి లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఖమ్మం జిల్లా వైరా వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉన్న తల్లాడ లో కొత్తగూడెం వెళ్లే రహదారి వెంబడి నిబంధనలకు విరుద్ధంగా సుమారు 25 మంది పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మార్కెట్కు రావాల్సిన ఆదాయానికి భారీగా గండి కొడుతున్నారు. అనుమతులు ముగ్గురు ముగ్గురితోపాటు మరి కొంతమంది సుమారు 25 అక్రమ కొనుగోలు కేంద్రాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు లేకపోలేదు. పర్యవేక్షించవలసిన జిల్లా అధికారులు. వైరా వ్యవసాయ మార్కెట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. వీరి వ్యవహార శైలిపట్ల ప్రజల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పర్యవేక్షించవలసిన జిల్లా మార్కెటింగ్ అధికారి తనకేమీ పట్టనట్టు నామమాత్రపు చర్యలు చేపట్టి నోటీసులు ఇచ్చి ఆ నోటీసులుపై ఎలాంటి రిప్లై లేకపోయినా వారిపై చర్యలు చేపట్టక పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు రహదారి పక్కన దర్జాగా పత్తి కొనుగోలు కేంద్రాలు కొనసాగుతుంటే అధికార అంతరంగానికి కనిపించడం లేదా అధికారుల నిర్లక్ష్యం వల్లనే మార్కెట్ కి రావాల్సిన ఆదాయానికి గండిపడుతుంది జిల్లా కలెక్టర్ గారు తల్లాడలో ఏర్పాటు చేసిన అనుమతి లేని పత్తి కొనుగోలు కేంద్రాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రైతుల కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily