Friday, 24 July 2026 07:41:02 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

క్రాంతి కళాశాలలో ఘనంగా కాళోజి జయంతి వేడుకలు..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 September 2025 03:01 PM Views : 729

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్/9 వైరా (అక్షరంన్యూస్) ఠాగూర్ విద్యా సంస్థలైన శ్రీ క్రాంతి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో కాలోజి నారాయణరావు జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. కాళోజీ నారాయణరావు చిత్రపటానికి విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి సునీత కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంక్రాంతి రవికుమార్ మాట్లాడుతూ తెలంగాణ భాషలోని యాసను మాధుర్యాన్ని తన రచనలలో పొందుపరచి తెలంగాణ వానిని ఎలుగెత్తి చాటిన ప్రజాకవి, ప్రజల మనిషి, చైతన్య మూర్తి కాళోజీ అని, పుట్టుక నీది చావు నీది... బ్రతుకంతా దేశానిది అంటూ ఆయన జీవిత కాలమంతా ప్రజా ఉద్యమాలకు ధారపోసిన మహా మనిషి అని, అన్యాయాన్ని ఎదిరించిన కాలోజీ కలము నుండి జాలువారిన ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క తూట... భావితరాలకు పోరాట స్ఫూర్తిని నింపిన నిరసన కెరటం అని నినాదించిన మహానీయుడు కాలోజీ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతి ప్రధానోత్సవం చేశారు. విద్యాసంస్థల డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ లింగారావు, మజీద్, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :