Friday, 06 March 2026 03:05:50 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం

భార్య పిల్లల బాగోగులు చూడని ఉద్యోగి సస్పెన్షన్ ...ఉద్యోగ బాధ్యత కాదు... కుటుంబ బాగోగులు కూడా చూడాలి.. .... జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 20 August 2025 07:47 PM Views : 2295

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ... ... పెద్దపల్లి, ప్రతినిధి ఆగస్టు -20 అక్షరం న్యూస్; ఉద్యోగులు ఉద్యోగ బాధ్యతలతో పాటు కుటుంబ బాగోగులు కూడా చూసుకోవాలని, లేనిపక్షంలో వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంచల నిర్ణయం తీసుకున్నారు. కుటుంబ బాగోగులు పట్టించుకోకుండా తరచూ భార్య పిల్లల పట్ల అశ్రద్ధ వహిస్తున్న ఓ ఉద్యోగిని ఏకంగా సస్పెండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్. తరచుగా గృహ హింసకు పాల్పడుతూ భార్యా పిల్లల బాగోగులు పట్ల శ్రద్ధ వహించని ప్రభుత్వ ఉద్యోగి ను విధుల నుండి సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలోని ఓదెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు ఫార్మసిస్టుగా పని చేస్తున్న కె .రవీందర్ భార్యా పిల్లలను పట్టించుకోకుండా వారి పోషణను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆయన భార్య కలెక్టరేట్లో ఫిర్యాదు చేసిందని అన్నారు. స్థానిక సఖి కేంద్రం సిబ్బంది భార్యాభర్తల ఇరువురికి కౌన్సిలింగ్ నిర్వహించడానికి ప్రయత్నించగా, కె .రవీందర్ సహకరించలేదని, గృహహింస నిరోధక చట్టం ప్రకారం జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్ నోటీసులు జారీ చేసినప్పటికీ రవీందర్ కౌన్సిలింగ్ కు హాజరు కాలేదని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధికారులు నివేదిక అందించారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పరివర్తన నియమావళి ప్రకారం భార్య పిల్లల పోషణను నిర్లక్ష్యం చేస్తున్న ఫార్మాసిస్టు కె రవీందర్ ను విధుల నుండి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :