D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/వైరా/ సెప్టెంబర్/4 (అక్షరంన్యూస్) వైరా లోని స్థానిక వాసవి కళ్యాణమండపంలో ఆర్యవైశ్య మండల సంఘం మరియు వాసవి యూత్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా మట్టి గణపతితో నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఉత్సాహంగా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వాసవి కళ్యాణ మండపంలో ఎనిమిది అడుగుల మట్టి బాల గణపతిని విగ్రహాన్ని నిలబెట్టారు గణనాథునికి భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 10 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్య రాష్ట్ర నాయకులు వనమా విశ్వేశ్వరరావు ఆర్యవైశ్య కళ్యాణ మండపం ఉపాధ్యక్షులు నూకల శ్రీనివాసరావు ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు మిట్టపల్లి కిరణ్ కుమార్ వజినేపల్లి చక్రవర్తి వనమా మల్లికార్జునరావు విగ్రహ దాత సంక శ్రీనివాసరావు తెలిపారు పర్యావరణాన్ని కాపాడటం ముఖ్యదేయమని అందుకే ఈ మట్టి విగ్రహాలు నిలబడుతున్నామని తెలిపారు ప్రతి సంవత్సరం ఉత్సవాలను అత్యంత భక్తిశ్రద్ధలతో రోజుకొక రీతిగా నిర్వహిస్తున్నామని 108 రకాల పిండి వంటలతో ప్రసాదాలు ఒకరోజు అందించామని వారు తెలిపారు నవరాత్రి ఉత్సవాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అర్చకులు రాంబాబు మాట్లాడుతూ రక రకాల మట్టి విగ్రహాలను ప్రతి సంవత్సరం ప్రతిష్టించడం జరుగుతున్నాయని అన్నారు 32 గణపతులు ఉన్నారని 32 గణపతుల్లో బాలగణపతి ఈ సంవత్సరం నిలిపారని తెలిపారు బాలగణపతి లక్ష్మీ గణపతి చప్పరిగణపతి వశిష్ట గణపతి రకరకాలుగా ఉన్నాయని ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఆకారాన్ని ఇక్కడ ప్రతిష్ట జరుగుతుందని అర్చకులు వివరించారు బాలగణపతి కి పూజలు నిర్వహిస్తూ వచ్చిన భక్తులు కూడా చూసి పరవశించి పోతున్నారని పీటల మీద కూర్చొని భక్తులు ఉదయం సాయంత్రం అత్యంత వైభోపీతంగా భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు అదేవిధంగా వాసవి మహిళా యూత్ ఆధ్వర్యంలో లలిత సహస్ర పారాయణం విష్ణు సహస్ర పారాయణం హనుమాన్ చాలీసా పారాయణం నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్ధి బుద్ధి వినాయకునికి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.
.
Aksharam Telugu Daily