Monday, 15 December 2025 06:52:39 AM
 Breaking
     -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు.. టీజీఈ హైట్స్ ప్రాజెక్టును విజయవంతం చేయండి.. . టీజీవో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 14 September 2025 08:19 PM Views : 409

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ సెప్టెంబర్ 14 (అక్షరంన్యూస్) ఖమ్మం: ఆదివారం పోలేపల్లి లోని రాజీవ్ స్వగృహ సముదాయం నందు ప్రభుత్వ ఉద్యోగుల హౌస్ బిల్డింగ్ సొసైటీకి టెండర్ దక్కినందుకు పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఏలూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా మంత్రివర్యులు భట్టి విక్రమార్క మల్లు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరావు వారి సహకారంతో ప్రభుత్వ ఉద్యోగులకు అతి తక్కువ ధరలో గృహ సదుపాయం కల్పించాలని సదుద్దేశంతో ఈ ప్రాజెక్టును సాధించుకున్నామని కావున ఈ అవకాశాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారు హోంగార్డులు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. హైదరాబాదులో ఉన్న ఐ రైజ్డ్ బిల్డింగ్స్ కు సరి సమానంగా ఈ ప్రాజెక్టును ఒక మోడల్ ప్రాజెక్టుగా రూపొందించి సంవత్సరంలోపే పూర్తి చేసి ఉద్యోగులకు అందుబాటులోకి తీసుకువస్తామని, మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి ద్వారా ఈ రాజీవ్ స్వగృహ సముదాయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులైన ఉపాధ్యాయులు, పెన్షనర్స్ , గెజిటెడ్, నాన్ గెజిటెడ్, పంచాయతీరాజ్, రెవిన్యూ, శాఖలతో పాటు పోలీస్ శాఖ వారు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని దానితోపాటు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులైన ఎల్ఐసి, బ్యాంకింగ్, సింగరేణి, హెవీ వాటర్ ప్లాంట్, కె.టి.పి.ఎస్, జెన్కో, ఎఫ్.సి.ఐ కి చెందిన అన్ని రంగాల ఉద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేక ఒరవడి కలిగిన ఖమ్మం జిల్లాలో ఉద్యోగ కమ్యూనిటీ అంతా ఒకే ప్రాంతంలో ఉండే విధంగా ఈ ప్రాజెక్టును రూపొందించి ఆదర్శవంతంగా ఉండేలా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉద్యోగులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఎస్బీఐ రిలేషన్ షిప్ మేనేజర్ రవీంద్ర మాట్లాడుతూ ఎస్బీఐ బ్యాంకు లోన్ ఎలిజిబిలిటీ ఉన్నా వారందరికీ లోన్ ఇస్తామని,హౌసింగ్ లోన్ కు సంబంధించి సందేహాలు కి వివరణా ఇచ్చారు .ఈ రోజు 26 మంది ఎన్రోల్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓస్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి శ్రీనివాసరావు, కార్యదర్శి కొణిదేన శ్రీనివాస్ , టీజీ ఓ జిల్లా కార్యదర్శి మోదుగు వేలాద్రి, టీజీవో హౌస్ బిల్డింగ్ సొసైటీ సెక్రటరీ విజయ్ కుమార్, శేష్ ప్రసాద్, రాంబాబు, పుష్ప రాజ్, మాధవరావు,వేల్పుల శ్రీను,వెంకటేశ్వర్లు, టిఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జెడ్, ఎస్ . జైపాల్ విజయకుమార్,ఎర్ర రమేష్, తాళ్లూరి శ్రీకాంత్,పెద్దినేని రాధాకృష్ణ, పిఆర్ టియు జిల్లా మాజీ అధ్యక్షులు యలమద్ది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2025. All right Reserved.

Developed By :