Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / ఏప్రిల్ 18/ అక్షరం న్యూస్ -: మదీనా మస్జిద్ లో శుక్రవారం మొహమ్మద్ అంకుష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సదర్ ఉస్మాన్ మాట్లాడుతూ ముస్లిముల పట్ల కేంద్రం లో ఉన్న బి జె పీ ప్రభుత్వం వైఖరిని ఎండగట్టారు. హిందూ, ముస్లిములకు, క్రిస్టియనులకు మధ్య చిచ్చు పెడుతూ రాజ్యం ఎలుతున్నారు అని రాజ్యాంగ పరి రక్షణ మనందరి బాధ్యత అని, పార్లమెంట్ లో వక్ఫ్ బిల్లు ను వెంటనే రద్దు చేయక పోతే ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు. జిల్లా ముస్లిం జె ఏ సీ ఆధ్వర్యంలో ఈనెల 25న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం లో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి భారీగా తరలి రావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అహ్మద్ పాషా, మొహమ్మద్, యాకూబ్ పాషా, జానీ, ఖాజా, గౌస్, అలిమ్, గోరే, మక్బూల్, ముబీన్, హాజి, అన్మోల్ అహ్మద్ రజా మరియు మస్జిద్ ముసల్లీలు పాల్గొన్నారు.
Aksharam Telugu Daily