Monday, 12 January 2026 11:34:49 PM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> కొత్తగూడెంలో క్రిస్మస్ క్యారెల్స్ సందడి : ..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి ఉత్తర తెలంగాణకు అవకాశం ఇవ్వాలి ... ఆర్యవైశ్య మహాసభ పెద్దపల్లి జిల్లా కార్యవర్గం ఏకగ్రీవ తీర్మానం

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడి రేసులో కోలేటి రమేష్


GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA.

Admin

Date : 27 July 2025 04:26 PM Views : 482

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : .. పెద్దపల్లి ప్రతినిధి జులై 27 అక్షరం న్యూస్; తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్ష పదవి ఈసారి ఉత్తర తెలంగాణ ప్రాంతానికి అవకాశం కల్పించాలని ఆర్యవైశ్య మహాసభ పెద్దపల్లి జిల్లా కార్యవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. అంతేకాకుండా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడి రేసులో ఈ ప్రాంతానికి చెందిన కోలేటి రమేష్ ఉంటున్నారు. ఆయనకు సంపూర్ణ మద్దతు తెలుపడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఆయన గెలుపు కోసం ప్రచారం నిర్వహించాలని కార్యవర్గం తీర్మానించింది. పెద్దపల్లి పట్టణంలో ఆర్యవైశ్య భవనం లో తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం గురుంచి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గత 12 సంవత్సరాలు నుండి ఏర్పాటు అయిన మహాసభ భై లా లో ఉన్న అనుగుణంగా ఉత్తర తెలంగాణ కు రెండు సంవత్సరాలు, దక్షిణ తెలంగాణకు రెండు సంవత్సరాలు మహాసభ అధ్యక్షుడిగా ఉండాలనీ నిర్ణయించారని, కానీ గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి నియామవళి ఏమి పని చేయకుండా ఏకాధిపత్యంతో 12 సంవత్సరాల నుండి ఒక్కరే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారని అందుకే ఈసారి ఉత్తర తెలంగాణ ప్రాంతం నుండి అధ్యక్ష పదవి కోసం పెద్దపల్లి జిల్లా నుండి బరిలో నిలువనున్నట్టు వారు పేర్కొన్నారు. దాని కొరకు అవసరమైతే కొందరు ఆర్యవైశ్య మహాసభ పెద్దలు కోర్టులను ఆశ్రయించి ఎన్నికలు నిర్వహించాలని కోరడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసి ఆర్యవైశ్యులు అందరు కలిసి ఎన్నికలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది, దీనికి అనుగుణంగా ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రతిసారి దక్షిణ తెలంగాణ నుండి అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరుగుతుంది, కానీ ఈసారి ఉత్తర తెలంగాణ వారికి అవకాశం ఇచ్చి అధ్యక్షుడిగా పెద్దపల్లి ఆర్య వైశ్య జిల్లా కమిటీ కొలేటి రమేష్ గారిని ఎన్నుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్య వైశ్య అధ్యక్షులు నలుమాచ ప్రభాకర్ ఏళ్లంకి రాజేందర్, కోమురవెల్లి విజయ్ కుమార్, వెంకట్ నారాయణ, వెనిశెట్టి నటరాజ్, కొమురవెల్లి సుధాకర్, పైడా రవి, పెద్ది వెంకటేష్, కాసనగోట్టు వినయ్, ముస్త్యాల సంతోష్, వెలిశాల నవీన్ కుమార్, అల్లంకి రామన్న,ముస్త్యాల రవి కిషోర్,ఇమ్మడి రాజన్న , నార్ల నాగభూషణం యేల్లంకి శ్రీనివాస్, ఇల్లెందుల కృష్ణమూర్తి,బళ్ళు చంద్రప్రకాష్ గుప్తా, ముస్త్యాల శ్రీనివాస్ మరియు వివిధ మండలాల అధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారులు మరియు ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :