AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల అక్టోబర్ 4/ అక్షరం న్యూస్/--- ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా మధ్ధీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందెపార అడవి ప్రాంతంలో మావోయిస్టులు పోలీసులను లక్ష్యంగా చేసుకొని ఐఈడి పేలుడు పదార్థాలను పెడుతుండగా ప్రమాదవశాత్తు ఐఈడీ పేలి మహిళా మావోయిస్టు కు తీవ్ర గాయాలు అయ్యాయి.ఐఈడి పేలడంతో గాయపడిన మహిళా మావోయిస్టులను అక్కడే వదిలేసి ఆయుధాలు తీసుకొని మిగిలిన మావోయిస్టులు అడవిలోకి పారిపోయారని బీజాపూర్ పోలీసులు తెలిపారు. స్థానిక గ్రామస్తుల సమాచారంతో పోలీస్ బృందం గాయపడిన మహిళా మావోయిస్ట్ కు ప్రధమ చికిత్స అందించి మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం బీజాపూర్ హాస్పిటల్ కు తరలించారు. గాయపడిన మహిళా మావోయిస్టు గుజ్జా సోది ఈమె గత ఆరు ఏడు సంవత్సరాలుగా ఏ సీఎం కన్నా బుచ్నా తో పాటు మధ్ధీద్ ఏరియా కమిటీ లో పార్టీ సభ్యురాలుగా చురుగ్గా పనిచేసింది. సమాజం నుండి దారి తప్పిన యువత హింస మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో చేయాలని పోలీసులు పిలుపునిచ్చారు.
.
Aksharam Telugu Daily