AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/ చర్ల సెప్టెంబర్ 1/ అక్షరం న్యూస్/----విద్యార్థులు కష్టపడి చదివి బంగారు బాటను నిర్మించుకోవాలని చర్లలోని ఎం ఆర్ ఎఫ్ టైర్స్ డీలర్ నల్లూరి పాండురంగ అన్నారు. సోమవారం నల్లూరి పుల్లయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారులు నల్లూరి సత్యనారాయణ, పాండురంగ, మురళి లు చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయంకు రూ. వేల నగదును అందచేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గిరిజన గ్రామాలకు చెందిన విద్యార్దుల అభ్యున్నతికి విద్యార్ది నిలయం ఏర్పాటు చేయడం అబినందనీయమని అన్నారు. విద్యార్దులు ఈ అవకాశంను సద్వినియోగం చేసుకోవాలని ఆకాంక్షించారు. విద్యతోనే మానవజాతి మనుగడ ముడిపడి ఉన్నదని, కుటుంబంలో ఒక్కరు చదువుకొని జీవితంలో స్దిరపడితే ఆకుటుంబం మొత్తం స్దిరపడుతుందని పేర్కొన్నారు. మరోవైపు చర్లలోని పూజారిగూడెం ప్రభుత్వ పాఠశాల ప్రదానోపాద్యాయుడు చిట్టిబోతుల వేణుగోపాల్ తన తల్లిదండ్రులు చిట్టిబోతుల లక్షి - వెంకయ్యల జ్ఞాపకార్థం విద్యార్ది నిలయంకు 50 కేజీల బియ్యం, విద్యార్దులకు ఒకపూట బోజనం, పండ్లను అందచేసారు. కార్యక్రమంలో వనవాసీ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత, కొమరం భీం నిలయ కమిటీ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ, ఉపాద్యక్షులు గోగికార్ రాంలక్ష్మణ్, సహ కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, సభ్యురాలు పోలిన రమాదేవి, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily