DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ డిసెంబర్ 24 అక్షరం న్యూస్; పెద్దపల్లి పట్టణంలోని పెరిక (పురగిరి క్షత్రియ) కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో పట్టణ కమిటీ ఎన్నికలు ఆదివారం కుల మిత్రుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. “ఒక్కరి కోసం అందరం… అందరి కోసం ఒక్కరు” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సంఘ ఐక్యత, సామాజిక అభివృద్ధిపై నాయకులు ప్రాధాన్యతను తెలియజేశారు. ఈ ఎన్నికల్లో చుంచు ఆంజనేయులు ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా కర్రె రాజేశం, ముత్తినేని మల్లయ్య ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా చుంచు కనకయ్య, ఖజానాదారుగా ( కోశాధికారిగా) కర్రె ప్రవీణ్, సంయుక్త కార్యదర్శిగా నరెడ్ల రమేష్, మీడియా కార్యదర్శిగా దొమ్మటి రాజేష్ ను నియమించారు. అలాగే కార్యవర్గ సభ్యులుగా కర్రె రాజు, చుంచు సురేష్, కొట్టె సత్యం, వక్కల రాజు, ఎంబడి గట్టయ్య, దొమ్మటి రాజేందర్, దొమ్మటి మల్లయ్య, కొట్టె లక్ష్మీ రాజం లను ఎన్నుకున్నారు. సంఘానికి గౌరవ అధ్యక్షులుగా కొట్టె సదానందం, చుంచు మల్లయ్య, కర్రె చంద్రయ్య లను నియమించగా, గౌరవ సలహాదారుగా కారుకూరి సుధాకర్ వ్యవహరిస్తారని తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియను పరిశీలకులుగా లగిశెట్టి చంద్రమౌళి మరియు మంద సాయి ప్రణీత్ గార్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, సంఘాన్ని మరింత బలోపేతం చేస్తూ కుల మిత్రుల సంక్షేమం, ఐక్యత కోసం సమిష్టిగా పనిచేస్తామని తెలిపారు. కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.
.
Aksharam Telugu Daily