Saturday, 19 September 2026 03:04:20 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

యూపీఐ లావాదేవీల పై పన్నును ఎత్తివేయాలని మాస్ లైన్ ఆందోళన

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన మాస్ లైన్ నాయకులు. * ప్రజల నుండి కొత్త రకం యూపీఐ పన్ను బాదుడు. * సి పి ఐ ఎం ఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జాటోత్ క్రిష్ణ.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 18 September 2026 06:55 PM Views : 46

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : * భద్రాద్రి కొత్తగూడెం/జూలూరుపాడు/సెప్టెంబర్ 18/అక్షరం న్యూస్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యూపీఐ లావాదేవీల పై విధించిన మర్చంట్ డిస్కౌంట్ రేట్ ఉపసమరించుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎంఎల్ ) మాస్ లైన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు జూలూరుపాడు మండల కేంద్రంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేసారు.ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జాటోత్ క్రిష్ణ మాట్లాడుతూ దేశంలో డిజిటల్ విప్లవానికి మారుపేరుగా నిలిచిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్సిటీ చెల్లింపులు ఎప్పట్లాగానే సాధారణ ప్రజలకు పూర్తి ఉచితంగా ఉంటాయని భావిస్తున్న నేపథ్యంలో, కేంద్రం, అమెరికా ప్రయోజనాల కోసమే పన్నును పద్ధతిని తీసుకొచ్చిందని వారు ఆరోపించారు, సాధారణ ప్రజలకు పూర్తి ఉచితంగా ఉంటాయంటూ వాణిజ్య లావాదేవీల సైతం అతి స్వల్ప పరిణామం మాత్రమే పన్ను విదిస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వ వాదన సరికాదని అన్నారు. వాణిజ్య సంస్థలు ఈ పన్ను పోటును వినియోగదారుల నుండే ముక్కు పిండి వసూలు చేస్తారన్న విషయం కేంద్రానికి తెలియదా అని ప్రశ్నించారు. ఈ చర్య వల్ల అన్ని రకాలుగా 30 వేల కోట్లకు పైగా దేశ ప్రజలపై భారం పడనుందని క్రిష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.ఇంత టాక్స్ చెల్లిస్తున్న ప్రజలు అది ప్రభుత్వానికి ఉపయోగపడకపోగా ప్రభుత్వ ధనాన్ని ఆస్తులని కార్పొరేట్ శక్తులకు రకరకాల పేరిట అప్పజెప్తున్న వైనాన్ని మరవరాదని అన్నారు. బ్రిటిష్ వారు ఇండియాకు టీ కాపీలను ఉచితంగా అలవాటు చేసి లక్షల కోట్ల వ్యాపారం నేడు చేస్తున్నట్లు అమెరికా యూపీఐ లావాదేవీల కంపెనీలు 10 ఏళ్లు ఉచితంగా సేవలు అందించి ప్రజలందరికీ అలవాటు అయిన తర్వాత ఈరోజు తొలిత వాణిజ్యానికి తర్వాత సామాన్యులపై ఈ పన్ను పోటు పెంచే ప్రమాదం ఉందని అన్నారు. తక్షణమే ఆన్లైన్ లావాదేవీలపై కేంద్రం విధించిన పనులను ఎత్తివేసి మరింత సరళంగా ఆన్లైన్ చెల్లింపులు జరిగేటట్లు చూడాలని కోరారు. ఇప్పటికే మోడీ పాలనలో అన్ని రకాల ధరలు ఆకాశానంటేయని అన్ని రకాల నిజ వేతనాలు పాతాళానికి పడిపోతున్న ఈ నేపథ్యంలో మరికొంత భారాన్ని వేయటమంటే మూలీగే నక్కపై తాటిపండు పడ్డ చందమే నని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే డిజిటల్ లావాదేవీల పై విధించిన పన్నును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టియుసిఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఏదులాపురం గోపాలరావు,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు రాజశేఖర్, రైతు సంఘం జిల్లా నాయకులు బైరు వెంకన్న, తోటకూరి నరేష్, మదు,రమేష్, సేవ్యా,తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :