AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ ఆగష్టు 15 అక్షరం న్యూస్ దేశ స్వాతంత్ర్య సంబరాలు అంబరాన్ని తాకుతున్న వేళ, పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం ప్రాంగణం దేశభక్తి భావనలతో దద్దరిల్లింది. జాతి కోసం ప్రాణాలర్పించిన మహానుభావుల త్యాగాలను స్మరించుకుంటూ, స్థానిక పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు స్థానికంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయిఈ సందర్బంగా పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం అత్యంత ఘనంగా మరియు వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య సగర్వంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. త్రివర్ణ పతాకానికి వందనం సమర్పించిన అనంతరం, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు పట్టణ ప్రజలందరికీ చైర్మన్ స్వాతంత్ర్య దినోత్సవ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్మన్ నూగిల్ల మల్లయ్య మాట్లాడుతూ. దేశానికి స్వతంత్రం తీసుకొచ్చేందుకు ఎంతో మంది మహానుభావులు, వీరులు తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగం చేశారని కొనియాడారు. వారి త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా వాయువులని అన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆయన ఉద్ఘాటించారు సమష్టి కృషితోనే పట్టణాభివృద్ధి పెద్దపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లోనూ ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నట్లు చైర్మన్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ విప్ మరియు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు మార్గదర్శకత్వంలో, మున్సిపల్ పాలకవర్గం, అధికారులు సమష్టి కృషితో పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని చెప్పారు. ఈ వేడుకలను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, కౌన్సిలర్లు, మెప్మా ఆర్పీలు, ఓబీలు, శానిటేషన్ సిబ్బంది, ఇతర కార్యాలయ సిబ్బంది అందరికీ ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
.
Aksharam Telugu Daily