Wednesday, 04 March 2026 01:41:58 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

బషీర్బాగ్ పోరాట ఫలితమే నేటి ఉచిత విద్యుత్తు ... సిపిఎం మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వర రావు


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 09 September 2025 03:24 PM Views : 402

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ తల్లాడ సెప్టెంబర్ 9 (అక్షరంన్యూస్) తల్లాడ మండల కేంద్రంలోని గోపాలపేట కుర్నవల్లి మరియు పలు గ్రామాల్లో సత్తనపల్లి రామకృష్ణ 26వ వర్ధంతి సభలు జరిగాయి.. ఈ సందర్భంగా గోపాలపేటలో పార్టీ శాఖ కార్యదర్శి పేరసాని వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో సిపిఎం మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వర రావు మాట్లాడుతూ 2000 సంవత్సరం ఆగస్టు 28న నాటి ప్రభుత్వం ప్రజలపై వేసిన విద్యుత్తు భారాలకు వ్యతిరేకంగా జరిగిన శాంతియుత పోరాటాన్ని ఉక్కుపాదంతో అణచివేసే ప్రయత్నం చేసిందని ఆ సందర్భంగా నాటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు విధానాలను అమలులో భాగంగా విద్యుత్ బారాలను ప్రజలపై మోపిందని ఈ భారాలకు వ్యతిరేకంగా అధికారాన్ని ఇచ్చిన ప్రజలపై నిర్దాక్షిణ్యంగా లాటిచార్జి బాష్పవాయువు గోళాలు తుపాకి గుల్ల వర్షాన్ని కురిపించి నాటి స్వతంత్ర పోరాటంలో 1919లో బ్రిటిష్ ప్రభుత్వం ప్రజలపై జరిపిన జలియన్ వాలాబాగ్ దురంతాని గుర్తు చేసిందని అన్నారు. నాటి చంద్రబాబు ప్రభుత్వం బషీర్బాగ్లో జరిపిన దాడిలో ఇద్దరు అక్కడే మృతి చెందారు సత్తెనపల్లి రామకృష్ణ 12 రోజుల మృత్యుతో పోరాడి సెప్టెంబర్ 8న చనిపోయారని వందలాదిమంది శరీరంలో బుల్లెట్లు ఇప్పటికీ ఉన్నాయని అన్నారు వారి త్యాగాల ఫలితమే నేటికీ అమలు అవుతున్న ఉచిత విద్యుత్ అని అన్నారు. సమస్య ఏదైనా ప్రభుత్వం ఏదైనా ప్రజల తరఫున ప్రజల కోసం పోరాడేది ఎర్ర జెండా మాత్రమేనని ఆ ఎర్రజెండాను కాపాడుకోవటమే ఎర్ర జండా కోసం పనిచేయటమే సత్తెనపల్లి రామకృష్ణకు ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు కార్యక్రమంలో పార్టీ డివిజన్ కమిటీ సభ్యులు నల్లమోతు మోహన్ రావు పులి వెంకట నరసయ్య పేరసాని లత కొమ్మినేని రాంబాబు పేరసాని సత్యం సుంకర కృష్ణయ్య నున్నా శీను కొత్తపల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :