Sunday, 22 November 2026 06:50:27 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

నిరుద్యోగ యువతకు ఉద్యోగ భరోసా కల్పించడమే లక్ష్యం మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి యువత ముంగిటకే 20కి పైగా దిగ్గజ కంపెనీలు 2వేల

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 20 November 2026 07:48 PM Views : 73

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్ 20 అక్షరం న్యూస్ ఉద్యోగ అన్వేషణ కోసం హైదరాబాద్ వంటి మహానగరాలకు వెళ్లే పనిలేకుండా, స్థానిక యువత ముంగిటకే దిగ్గజ కంపెనీలను తీసుకువస్తున్నామని పెద్దపల్లి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో,ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి సౌజన్యంతో శనివారం నిర్వహించనున్న మెగా జాబ్ మేళా పోస్టర్‌ను శుక్రవారం కళాశాల సిబ్బందితో కలిసి ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ దాసరి మమతా రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాబ్ మేళాలు నిర్వహిస్తూ, నిరుద్యోగులకు ఉపాధి కల్పించడాన్ని ట్రినిటీ విద్యాసంస్థలు ఒక సామాజిక బాధ్యతగా తీసుకున్నాయని అభినందించారు. పెద్దపల్లి నియోజకవర్గ చరిత్రలోనే తొలిసారిగా 20కి పైగా మల్టీనేషనల్ కంపెనీలు ఒకే వేదికపైకి వచ్చి, 2 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించడం విశేషమన్నారు.గతంలో దాసరి మనోహర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనూ ప్రత్యేక కోచింగ్ ఇప్పించి, దాదాపు 3 వేల మంది యువతకు ఆర్మీ,ఇతర రక్షణ దళాల్లో ఉద్యోగాలు వచ్చేలా కృషి చేశారని గుర్తుచేశారు. ఉద్యోగం అంటే కేవలం వ్యక్తిగత ఉపాధి మాత్రమే కాదని,ఒక కుటుంబానికి ఆర్థిక భరోసా అని ఆమె అన్నారు.యువత తమ భవిష్యత్తు కోసం ఒక్క ముందడుగు వేస్తే, వారికి అండగా నిలిచేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. అభ్యర్థులు ఆత్మవిశ్వాసంతో ఇంటర్వ్యూలకు హాజరై విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డికి,చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నేడే మెగా జాబ్ మేళా పెద్దపల్లి ప్రగతి నగర్‌లోని ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం నవంబర్ 21 ఉదయం 9 గంటల నుండి మెగా జాబ్ మేళా ప్రారంభమవుతుంది. అండర్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లుతదితర అర్హత కలిగిన నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా మరియు సర్టిఫికెట్లతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో ట్రినిటీ విద్యాసంస్థల అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ అశోక్ కుమార్,ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేష్,అడ్మిన్ ఆఫీసర్ సురేష్,రాజిరెడ్డి,చొప్పరి వంశీ, ప్రభాకర్,డాక్టర్ ఆరిఫ్,ట్రైనింగ్ అండ్ ప్లేస్‌మెంట్ ఆఫీసర్ భవిత,స్వాతి,అశోక్,లక్ష్మి, వంశీ తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :