GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /మార్చి -28(అక్షరం న్యూస్ ) మన ఇసుక వాహనానికి అధికారికవెబ్ సైట్ ద్వారా మాత్రమే ఇసుక కోసం దరఖాస్తు చేసుకునేలా ప్రభుత్వ ఉత్తర్వులు మంజూరు అయినవి అని ముస్తాబాద్ తహసిల్దార్ రామచంద్రం ఒక ప్రకటనలో తెలియజేశారు ముస్తాబాద్ మండలంలోని ఇసుక వినియోదారులు మన ఇసుక వాహనం ఆన్ లైన్ పోర్టల్ ద్వారా కొండాపూర్ ఇసుక రిచ్ నుంచి ఇంటి నిర్మాణం, ఇందిరమ్మ ఇళ్ళు,ప్రభుత్వ నిర్మాణాలు, ప్రభుత్వ కాంట్రాక్టులు,ఇసుక ట్రాక్టర్ ద్వారా బుక్ చేసుకోవడానికి మైనింగ్ శాఖ అనుమతించిందని మండల తహసీల్దార్ రామచంద్రం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు ఇసుక అవసరమైన వారు ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుక్ చేసుకుని అనుమతి పొందాలని తెలియజేశారు దీని వలన మరింత పారిదర్శకత పెరిగి వినియోదారులకు మేలు జరుగుతుందని తెలియజేశారు
.
Aksharam Telugu Daily