AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి జిల్లా/ సుల్తానాబాద్ : సుల్తానాబాద్ ఆగస్టు 02 అక్షరం న్యూస్ సుల్తానాబాద్: చిన్నారులలో భక్తి భావం పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఉపయోగపడతాయన్నారు యువసంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తుమ్మ రాజ్ కుమార్. 10 సంవత్సరాలలోపు చిన్నారులు జైశ్రీరామ్ అంటూ 516 సార్లు రాసిన చిన్నారులకు ప్రశంసా పత్రం తో పాటు మెడల్స్ అందించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో చిన్నారులకు మెడల్స్ ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన యువ సంకల్ప ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తుమ్మ రాజ్కుమార్ మాట్లాడుతూ... ప్రస్తుతం ఉన్న ఆధునిక యుగంలో భక్తి భావం పెంపొందించాలంటే ఇలాంటి కార్యక్రమాలు చాలా నిర్వహించాల్సి ఉందని, సానున్న రోజుల్లో 15 సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులకు కూడా మరిన్ని భక్తి భావ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. స్వల్ప కాలంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విశేష స్పందిన లభించిందని, సుమారు 500 కు పైన చిన్నారులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారని, విడుదలవారీగా వారికి ప్రశంసా పత్రాలతో పాటు మెడల్స్ అందజేయడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ సమత కుమార్, యువ సంకల్ప ఫౌండేషన్ సభ్యులు చిలగాని విశ్వనాథ్, తుమ్మని శాంత్, మెగా బ్లడ్ డోనర్ గాలిపల్లి కుమార్, రమేష్, శివ, న్యూ హరిజన్ స్కూల్ ప్రిన్సిపాల్ స్వప్న, గుంటి రాకేష్, చిన్నారులు తదితరులు ఉన్నారు.
.
Aksharam Telugu Daily