Friday, 21 August 2026 11:13:24 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వైరా మున్సిపాలిటీలో దళారులను నమ్మకండి.. మోసపోకండి నేరుగా మున్సిపాలిటీ అధికారులను సంప్రదించండి.. ఆదాయానికి గండి కొడుతున్న వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 21 May 2026 07:50 AM Views : 379

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్ మే 21 వైరా (అక్షరం న్యూస్) వైరా మున్సిపాలిటీ పరిధిలోని 20 వార్డుల ప్రజలకు , వ్యాపారస్తులకు విజ్ఞప్తి .వైరా మున్సిపాలిటీలో నిర్మించుకుంటున్న నూతన భవనాల అనుమతులు కొరకు, పాత ఇండ్లు కి మున్సిపాలిటీలో ఇంటి నెంబర్ల కొరకు , ఇంటి పన్నులు అధికంగా వస్తే వాటిని తగ్గిస్తామని, అదేవిధంగా వ్యాపారస్తుల వద్ద ట్రేడ్ లైసెన్సు ఫీజులు రెన్యువల్ విషయంలో మున్సిపాలిటీ సిబ్బంది కొంతమంది ప్రజలను తప్పుదోవ పట్టించి మున్సిపాలిటీ ఆదాయాలకు గండికోడుతూ తప్పుడు మార్గంలో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల కాలంలో వైరా మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే బదిలీలపై వెళ్లిన అధికారులు కూడా మున్సిపాలిటీలోని ప్రజలు వారి యొక్క అవసరాల కోసం బదిలీ అయిన విషయం తెలియక ఫోన్ల ద్వారా సంప్రదిస్తుంటే పనులు చేసి పెడతామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారు... ఇటువంటి విషయాలు వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ దృష్టికి ఫోన్లో ప్రజలు వారి వద్ద డబ్బులు తీసుకుని మా పనులు చేయట్లేదు అంటూ తమ గోడును చెప్పుకున్నారు.. వెంటనే ఎమ్మెల్యే రాందాస్ నాయక్ స్పందించి ఎవరైతే చేతివాటం ప్రదర్శిస్తున్నారు. అటువంటి సిబ్బందిని తొలగించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.. ప్రజలు వారి అవసరాల కోసం వైరా మున్సిపాలిటీకి నేరుగా వెళ్లి సంబంధిత అధికారుల ద్వారా పనులు చేయించుకోవాలని వైరా పట్టణ ప్రజలకు సూచించారు. అదేవిధంగా ఇంటి నెంబర్ల కోసం కొన్ని ప్రైవేటు సంస్థల వద్దకు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవడం కొరకు వెళ్తుంటే వారిని సక్రమమైన మార్గంలో ఇంటి నెంబర్లు ఇస్తే మున్సిపాలిటీకి అధిక మొత్తంలో డబ్బులు కట్టాల్సి వస్తుందని .. మేమైతే అంత డబ్బులు మున్సిపాలిటీకి కట్టకుండా నామినల్ ఫీజుతో సరిపుచ్చుతామని మున్సిపాలిటీ కట్టే డబ్బులో సగం డబ్బులు మాకు చెల్లించండి అని భారీ మొత్తంలో చేతివాటం ప్రదర్శిస్తున్న సంగతి కూడా వైరా శాసనసభ్యులు రాందాస్ నాయక్ కి ఫిర్యాదులు రావడం తో. వీటన్నిటిపై దర్యాప్తు జరిపించాలని వైరా పోలీస్ శాఖ వారికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆదేశించడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలు దళారును మధ్యవర్తులను నమ్మకుండా వారి యొక్క అవసరాలు ఏమైనా ఉంటే నేరుగా వైరా మున్సిపాలిటీ అధికారులు సంప్రదించి వారి యొక్క పనుల విషయంలో ఏదైనా ఇబ్బందులు జరిగితే మున్సిపల్ చైర్మన్ కి , వైస్ చైర్మన్ ని సంబంధిత వార్డు కౌన్సిలర్లకు కి తెలియ వైరా మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కట్ల సంతోష్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :