D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * *డిటివో లేకపోవడంతో ఇంచార్జి డీటీఓతో రెచ్చిపోతున్న ఏజెంట్లు* .. * *ఖమ్మం /అక్టోబర్/ 25* ఖమ్మం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతుంది. కంట్రోల్లోనే అధికారుల చేతిలో కాకుండా బ్రోకర్ల కంట్రోల్లో కదులుతున్నాయి. లేకపోతేనే ఫైళ్ళు కదులుతున్నాయి లేకపోతే రేపు రా మాపుర అంటూ కాలయాపన చేస్తున్నారు. డీటీవో బదిలీ జరిగి సంవత్సరం కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు అధికారికంగా డీటీవోను నియమించలేదు. దీంతో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఇన్చార్జి డిటిఓ) బాధ్యతలు చేపట్టడంతో మరింత పరిస్థితి దిగజారిందని వాహన యజమానులు వాపోతున్నారు. నేరుగా కార్యాలయానికి వెళ్లిన వారి పనులు నెలల తరబడి ఉండగా... బ్రోకర్ల ద్వారా వెళితే గంటల్లోనే ఫైలు కదులుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు రహస్య కోడ్ వ్యవహారం ఏదైనా ఫైల్ అంటే ముందుకు కదలాలంటే, బ్రోకర్ల ద్వారా కోడు పడాల్సిందే. కోడు పడిన వెంటనే పత్రాలు కదులుతాయి లేదంటే అది లేదు ఇది లేదు అంటూ నోసుగులు వెతికి పనులు అటకెక్కిస్తారు. ఇక ప్రభుత్వ సేవలను అందాలని పొందాలని భావించే వాహన యజమానులకు మేమిద్దం అన్నట్లు వ్యవహరిస్తున్న అధికారులు తీరుపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ప్రభుత్వ ప్రకటనలు గ్రౌండ్లో రియాలిటీ వేరు.. ఏజెంట్లను ఆశ్రయించవద్దని నేరుగా కార్యాలయాన్ని సంప్రదించాలని అధికారులు ప్రకటనలు చేస్తుంటారు. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంటుంది. అధికారులే ఏజెంట్లతో కుమ్మక్కై వసూళ్లకు పాల్పడుతున్నాట్లూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నేరుగా వెళ్లిన వారి పనులు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నకు అధికారులు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. *అధికారుల గర్జన.. బ్రోకర్ల హవా*.. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా జరుగుతున్న అవినీతిని అరికట్టడంలో మౌనం అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెంట్లు, అధికారులు కలిసి వాహన యజమాలను నడుము నొచ్చినట్లు లాక్కొస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆధార్, ఇన్సూరెన్స్ పత్రాలను స్కాన్ చేసి ఇవ్వాలని కొత్త కొత్తగా విధానాలు అమలు చేస్తూ మరింత ఇబ్బందులు గురి చేస్తున్నారు. *వసూళ్లు జిరాక్స్ సెంటర్లలో*.. రవాణా శాఖ అధికారికి చెందిన ప్రైవేట్ వ్యక్తులను పెట్టుకొని మట్టి అంటకుండా అక్రమ వసూళ్లు, కలెక్షన్లు చేయడంలో అధికారి దిట్టగా వ్యవహరించడం ఆరోపణలకు తావిస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏజెంట్ల నుంచి వచ్చిన ధ్రువీకరణ పత్రాలు, కార్డులు మీద అధికారులు చేసిన సంతకాల పైలు లెక్కలకు సంబంధించిన కమిషన్ డబ్బులను కార్యాలయాల ఎదురుగా ఉన్న జీరాక్స్ సెంటర్లలో బినామీలు కూర్చొని వసూలు చేస్తుంటారు. అధికారికి ఏ ఫైలు కి కమిషన్ ఎంత వస్తాయో వాటిని బినామీ వ్యక్తులు అందజేస్తున్నట్లు సమాచారం. రవాణా శాఖ కార్యాలయంలో బినామీ వ్యక్తులు సాయంత్రం 6 గంటల తర్వాత విధులు చక్కబెట్టడం పలు విమర్శలకు తావిస్తుంది . *బ్రోకర్ల రాజ్యం కూల్చడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది.*.? ఇకనైనా మంత్రులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఖమ్మం ప్రమాణ శాఖలో పెరుగుతున్న అవినీతిని అరికట్టాలని, ప్రభుత్వ సేవలను ప్రజలకు నేరుగా అందేలా చర్యలు తీసుకోవాలని వాహన యజమానులు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily