Saturday, 07 February 2026 06:20:15 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

తెలంగాణ రుచులకు రేవంత్ ఫిదా..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 18 January 2026 07:38 PM Views : 841

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/స్టాఫ్ రిపోర్టర్ జనవరి 18 (అక్షరం న్యూస్) ఖమ్మం : అచ్చమైన తెలంగాణ ఇంటి వంటల రుచులు… ఆత్మీయ ఆతిథ్యం… సంప్రదాయ పరిమళం… ఇవన్నీ కలిసిన ప్రత్యేక విందు ఖమ్మంలో జరిగింది. ఆదివారం ఖమ్మం జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ఘనమైన తెలంగాణ వంటకాల విందు ఏర్పాటు చేశారు. - *సీఎం ఫిదా* మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆహ్వానంతో ఏర్పాటు చేసిన ఈ విందులో స్వచ్ఛమైన తెలంగాణ రుచికి సీఎం రేవంత్ రెడ్డి ఫిదా అయ్యారు. “భోజనం అదిరింది… ఆతిథ్యం మెరిసింది” అన్నట్టుగా సాగిన ఈ విందులో తెలంగాణ నేటివిటీ ప్రతి వంటకంలో ఉట్టిపడింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం, సహచర మంత్రులు, ఇతర ముఖ్యులు విందుకు హాజరయ్యారు. ఇది పక్కా తెలంగాణ ఇంటి వంట రుచి అని పేర్కొన్నారు. తెలంగాణ స్టైల్లో వండిన ఘాటైన నాటుకోడి పులుసు…నోరూరించే రొయ్యల ఇగురు…చేపల కూర… అదిరిపోయే మటన్ ఫ్రై…ప్రత్యేక రుచితో చేసిన మటన్ కీమా రుచి చూసిన సీఎం వాటిని ఇష్టంగా ఆరగించారు. దాదాపుగా 17 రకాల నోరూరించే వంటకాలతో సీఎంకు రాజభోజనం వడ్డించారు. -వంటింటిని పర్యవేక్షించిన మంత్రి సతీమణి మాధురి ఈ విందులో మంత్రి సతీమణి పొంగులేటి మాధురి ప్రతి వంటకం సంప్రదాయ రుచులు తగ్గకుండా ఉండేలా స్వయంగా పర్యవేక్షించి తయారు చేయించారు. మాంసాహారం... శాఖాహారం రెండూ విశేషమే మాంసాహారంతో పాటు వేడివేడి జొన్న రొట్టెలు, రుచికరమైన వెజ్ పలావ్, క్యారెట్–కొబ్బరి ఇగురు, పచ్చిమిర్చి పచ్చడి వంటి శాఖాహార వంటకాలు కూడా సీఎంను విశేషంగా ఆకట్టుకున్నాయి. శాలువా సత్కారం...హస్తకళా బహుమతి భోజనం అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి, హస్తకళా పెయింటింగ్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి దంపతులు, మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి బహూకరించారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :