AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/బూర్గంపహాడ్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ బూర్గంపాడు, అక్షరం న్యూస్/ సెప్టెంబర్ 2; బుర్గంపహాడ్ : మండలం లో ఆగస్టు మాసం లో కురుస్తున్న భారీ వర్షాలు నేపధ్యం లో వరి మరియు పత్తి పంటకు వివిధ రకాల పోషక లోపాలు, చీడపీడలు వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు మరియు కొత్తగూడెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు తెలిపారు. నాగినేనిప్రోలు రెడ్డిపాలెం మొరంపల్లి బంజార సంజీవరెడ్డిపాలెం గ్రామాలలో వరి మరియు పత్తి పొలాలను పరిశీలనలో భాగంగా ఈ సమస్యలను సకాలంలో గుర్తించి నివారించడం ద్వారా పంట నష్టాన్ని నివారించవచ్చని అధికారులు సూచించారు. రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు, నివారణ చర్యల గురించి ఈ క్రింది విధంగా వివరించారు. వరి పంటలో గుర్తించబడిన ప్రధాన సమస్యలు: • మురుగునీటి తొలగింపు: పొలాల్లో నిలిచి ఉన్న వర్షపు నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. • ఎరువుల యాజమాన్యం • బ్యాక్టీరియా ఎండు తెగులు • కాండం తొలుచు పురుగు • అగ్గి తెగులు నివారణ చర్యలు: 1. పోషక లోపాల నివారణ: * జింకు లోపం: జింక్ సల్ఫేట్ 2 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. * పొటాష్ లోపం: ఎకరానికి 25 కిలోల పొటాష్ను వెదజల్లాలి. o లీటరు నీటికి 5 గ్రా. 19:19:19 మిశ్రమం లేదా o 2 మి.లీ. నానో యూరియా/నానో డీఏపీ పిచికారీ చేయాలి. 2. బ్యాక్టీరియా ఎండు తెగులు నివారణ: * కాపర్ ఆక్సీక్లోరైడ్ 600 గ్రాములు మరియు ప్లాంటోమైసిన్ 60 నుండి 80 గ్రాములు కలిపి 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి. 3. కాండం తొలుచు పురుగు నివారణ: * కార్టాప్ హైడ్రోక్లోరైడ్ గుళికలు ఎకరానికి 8 కిలోల చొప్పున వెదజల్లాలి. * కార్టాప్ హైడ్రోక్లోరైడ్ పౌడర్ అయితే 400 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలి. 4. అగ్గి తెగులు నివారణ: * మొదటి దశ: ట్రైసైక్లోజోల్ 0.6 గ్రా. లేదా ఐసోప్రాథయోలెన్ 1.5 మి.లీ. ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ట్రైసైక్లోజోల్ + మాంకోజెబ్ 2-2.5 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. * రెండవ దశ: ట్రైసైక్లోజోల్ + ప్రొపికోనజోల్ 250 మి.లీ. ఎకరానికి పిచికారీ చేయాలి. * తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు: ట్రైసైక్లోజోల్ + పికాక్సీస్ట్రోబిన్ 400 మి.లీ. లేదా టెబుకోనజోల్ + ట్రెఫ్లాక్సీస్ట్రోబిన్ 80-100 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలి. పత్తి • అధిక వర్షాల వల్ల వడ తెగులు వస్తే → లీటరు నీటికి 3 గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ పిచికారీ (వారంలో 2 సార్లు). • పంట కోలుకోవడానికి → లీటరు నీటికి 5–10 గ్రా. మల్టీ-కే/యూరియా లేదా 2 మి.లీ నానో యూరియా. • పత్తి లో దోమ నివారణ ఇమిడాక్లోప్రిడ్ 0.3 మి.లీ./లీటరు నీటికి లేదా థయామెథాక్సామ్ 0.25 గ్రా./లీటరు. • పొగాకు లద్దె పురుగు గుడ్డు పెట్టె దశలో ఉంది కావున తలలు తుంచాలని అందువల్ల మరిన్ని కొమ్మలు వచ్చి దిగుబడి పెరుగుతుంది అడవికి దగ్గరలో ఉన్న పొలాలలో స్టెమ్ వీవిల్ వచ్చే అవకాశం ఉంది కావున వేపద్రవనం 1500 ppm పిచికారీ చెయ్యాలని తెలిపారు అక్కడక్కడా బంతిపూలు , పక్షులు వాలడానికి పంగల కర్రలు ఏర్పాటు చెయ్యాలని తెలిపారు పురుగుమందు మరియు తెగులుమందు వాడే క్రమం లో షాంపూ సర్ఫ్ కానీ నువ్వుల నూనె కానీ కలిపి వాడాలని సూచించారు రైతులు సంప్రదాయ పంటలు మాత్రమే కాకుండా మునగ , ఆయిల్ పామ్ తోటలు వైపు దృష్టి సారించి అధిక లాభాలు పొందాలని కోరారు రైతులు ఎప్పటికప్పుడు వ్యవసాయ విస్తరణ అధికారులు లేదా వ్యవసాయ అధికారులను సంప్రదించి, వారి సూచనల మేరకు మాత్రమే పురుగు మందులను వాడాలని కోరారు. ప్రాథమిక దశలోనే పంటలో వచ్చే సమస్యలను గుర్తించడం ద్వారా పురుగు మందుల వాడకంపై అయ్యే ఖర్చులను తగ్గించుకోవచ్చని వారు సూచించారు. ఈ సమగ్ర సస్యరక్షణ చర్యల వల్ల పంటను రక్షించుకోవచ్చని వారు తెలిపారు. ఈ నెల పదో తారీఖు వరకు అధిక వర్షాలు ఉనందున ఎటువంటి పురుగు మందుల పిచికారీ చెయ్యకూడదని తెలిపారు ఈ కార్యక్రమం లో సహాయ వ్యవసాయ సంచాలకులు బి.తాతారావు గారు , శాస్త్రవేత్తలు శివ , హరిచంద్ర వ్యవసాయ విస్తరణ అధికారి శృతి ,నాగ వైష్ణవి ,పవన్ గారు మరియు రైతులు గాదె నర్సిరెడ్డి, కైపు సుబ్బిరామిరెడ్డి, బత్తుల రాంకొండారెడ్డి, బిజ్జం వెంకటరామిరెడ్డి , మారం శ్రీనివాసరెడ్డి, భజన పెద్ద నాగం, మేకల వెంకన్న, కంది జయరామిరెడ్డి, నిమ్మల రాములు, దుప్పటి రమణ పాల్గొన్నారు..
.
Aksharam Telugu Daily