AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్ : వరంగల్ జిల్లా/ వరంగల్ టౌన్ / ఏప్రిల్ 19 / అక్షరం న్యూస్ -; మహిళా బిల్లును అడ్డు పెట్టి డిలిమినేషన్ బిల్లును పాస్ చేసుకోవాలని చూసిన కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ నీతి వ్యూహాలని తిప్పి కొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందనీ వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ అన్నారు. వరంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ మాట్లాడుతూ బిల్లు వీగిపోవడంతో ప్రతిపక్షాలపై అసత్యప్రచారాలకు తెరలేపుతున్నారు అని ఆయన అన్నారు. మహిళలకు నిజంగా న్యాయం చేయాలనే నిబద్ధత ఉంటే మహిళా బిల్లును సప్రేట్ చేసి ప్రవేశ పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని అవమానిస్తూ పాకిస్తాన్ తో పోల్చి మాట్లాడటం బీజేపీ పార్టికీ సరికాదు అని తెలంగాణ పై వారికున్న సవతి తల్లి ప్రేమను మరోమారు నిరూపించుకున్నారనీ మహమ్మద్ అయుబ్ అన్నారు. గతంలో మహిళా బిల్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనే...ప్రతి అశంలోను మహిళలకు పెద్ద పీట వేసింది కాంగ్రెస్ పార్టీనే... గతంలో కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి ఇందిరాగాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అదేవిధంగా భారత దేశ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నుంచి సోనియా గాంధీ చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ దేశ లోక్ సభ స్పీకర్ గా మీరా కుమార్ ని చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇంకెన్నెన్నో కానీ ఈ బీజేపీ పార్టీ మహిళా పక్షపాతి అని చెప్పుకుంటుంది కానీ ఆచరణలో మాత్రం శూన్యం దమ్ముంటే మో�
.
Aksharam Telugu Daily