GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/అక్టోబర్ 08/అక్షరం న్యూస్: పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన వాక్యాలను కొంతమంది కావాలని దురుద్దేశంతో వక్రీకరించి దుష్ప్రచారానికి వెనుకుండి ప్రోత్సహిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకులు దేశిని కోటి మీడియాతో అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్ కు గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుగా, రాష్ట్ర కాంగ్రెస్ లో క్రియాశీలకంగా ఉన్నవారు. వీరిద్దరూ మంచి స్నేహితులు ఆ సన్నిహితంతో సంభాషించుకోవడం తప్ప, తెలంగాణ రాష్ట్రంలో ఏ కులానికి, ఏ వర్గానికి కించపరిచే విధంగా మాట్లాడే వ్యక్తి మంత్రి పొన్నం ప్రభాకర్ కాదు అని ఆయన స్పష్టం చేశారు. క్యాబినెట్ మంత్రులందరూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న క్రమంలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా, బీసీ ఎస్సీ మైనారిటీ నాయకుల ఎదుగుదల ఓర్వలేని ప్రతిపక్ష నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, వారు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించారు.
.
Aksharam Telugu Daily