Wednesday, 04 March 2026 01:40:37 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ఇంకా తీరుమారని ప్రైవేట్ పత్తి వ్యాపారుల అక్రమ దందా*.. *ప్రభుత్వ నిబంధనలు బేకాతర్*.. *దర్జాగా కొత్తగూడెం రోడ్ లో అక్రమ పత్తి వ్యాపారాలు*..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 24 October 2025 07:59 PM Views : 1134

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : * ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ తల్లాడ అక్టోబర్ 24 (అక్షరంన్యూస్) ఖమ్మం జిల్లా తల్లాడ లో అక్రమ పత్తి వ్యాపారుల ప్రైవేట్ దందా ఇంకా కొనసాగుతూనే ఉంది. పత్రికల్లో అనేక కథనాలు వచ్చినప్పటికీ వారు మాకేం కాదంటూ తమ వ్యాపారాన్ని నడిపిస్తూనే ఉన్నారు. కూత వేటు దూరంలో ప్రభుత్వ సిసిఐ కేంద్రం ప్రారంభించినప్పటికీ ప్రైవేటు వ్యాపారుల చీకటి వ్యాపారం కొనసాగుతూనే ఉంది. అమాయక రైతులను మోసం చేస్తూ లక్షల అధికారులు ప్రైవేట్ వ్యాపారాలు ఘటిస్తున్నారు. ప్రైవేటు యాపారం అక్రమంగా జరుగుతుందని మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులకు మీడియా ప్రతినిధులు దృష్టికి తీసుకెళ్లగా అక్రమ వ్యాపారులపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. ఓ జిల్లా అధికారి హెచ్చరికలు జారీ చేసినప్పటికీ తల్లాడ ప్రైవేట్ పత్తి వ్యాపారుల దందా వాటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అదేవిధంగా రాష్ట్ర మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయి అక్రమ పత్తి వ్యాపారులను నోటీసులు అందించి చేస్తామని సీజ్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. వాటిని కూడా ప్రైవేట్ వ్యాపారులు పట్టించుకోకుండా తమ అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. గత ఏడాది మండలంలోని పలు గ్రామాలకు చెందిన యువకులు ఆటోల ద్వారా వివిధ రాష్ట్రాలకు వెళ్లి రైతులను మోసం చేసి పత్తిని తీసుకొచ్చి తల్లాడలో అమ్మకాలు చేస్తే ఆనాడు తల్లాడ పోలీసులు పలువురు యువకులపై బైండోవర్ కేసులు నమోదు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. మరలా అదే విధంగా ప్రస్తుతం కూడా యువకులు ఆటోలు ద్వారా రైతులను మోసం చేసి పత్తిని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మకాలు చేపడుతున్నారు. అలాంటి వారిపై పోలీసులు కూడా బైండ్లవర్ కేసు నమోదు చేసి అవి చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ తల్లాడలో అక్రమ పత్తి వ్యాపారులపై కొరడాలు జూలిపించి రైతులకు న్యాయం చేయాలని, అదేవిధంగా ప్రభుత్వ సిసిఐ కేంద్రం ద్వారా పత్తిని కొనుగోలు చేసే విధంగా అవగాహన కల్పించాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :