GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/డిసెంబర్ 02/అక్షరం న్యూస్: జమ్మికుంట పట్టణంలోని చౌరస్తా నుండి వీణవంక రోడ్డుకు వెళ్లే ప్రధాన రహదారిలో ఉన్నటువంటి జియోమార్ట్ వద్ద వాహనదారులకు తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ముందు సరైన వాహన పార్కింగ్ సదుపాయం లేకపోవడం వలన మార్టుకు వచ్చే వినియోగదారులు రోడ్డుపై పార్కింగ్ చేస్తున్నడంతో నిత్యం వేలాది వాహనాలు తిరిగే రోడ్డు తరచూ వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో తరచూ వాహనాలు ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోరా అని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి నిత్యం వేలాది వాహనాలు తిరిగే ముఖ్య రోడ్డు వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకొని, సరైన పార్కింగ్ సదుపాయం లేనటువంటి జియో మార్ట్ పై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
.
Aksharam Telugu Daily