AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 16/ అక్షరం న్యూస్/---- మండల కేంద్రంలో మంగళవారం నాడు ఆదివాసి జేఏసీ ఆధ్వర్యం లో తాటి రామకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ ఆదివాసి సంఘాల సమన్వయ కమిటీ జేఏసీ చైర్మన్ పాయం సత్యనారాయణ దొర మాట్లాడుతూ ఈనెల 28 న భద్రాచలంలో జరగబోయే భారీ బహిరంగ సభకు ఆదివాసి గూడెల నుంచి గ్రామాల నుంచి ఆదివాసి యువత ఆదివాసి ప్రజానికం ఆదివాసి హక్కుల రిజర్వేషన్ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వాలని బహిరంగ సభలొ ప్రతి ఒక్క ఆదివాసి పాల్గొన్నారు. ఆదివాసి జాతి ఐక్యతను చూపాలని భారత రాజ్యాంగం 5వ షెడ్యూలు గోండు వాన భూభాగం లో రిజర్వేషన్లు ఆదిమా తెగలకు ఎస్టీ రిజర్వేషన్లు మాత్రమే దక్కాలని 1976లో డిఎన్టి గా (ఒకసారి డినోటిఫై ట్రైబ్) గా విద్య, ఉపాధి, రాజకీయ రిజర్వేషన్ల లొ చలామణి అవుతూ ఈరోజు ఎస్టీ రిజర్వేషన్ల అవకాశాన్ని మొత్తం కూడా రాజకీయ ఆర్థిక విద్య ఉద్యోగ ఉపాధి రంగాలలో రిజర్వేషన్ను కొల్లగొడుతూ ఆదిమ జాతులకు తీవ్రమైన అన్యాయం చేకూరుస్తున్నారని లంబాడి,మ సుగాలి బంజారా సామాజిక వర్గ ప్రజలు తీవ్ర అన్యాయం చేస్తూరని ఆదివాసి జేఏసీగా మండిపడ్డారు. అనంతరం తెలంగాణ నాయకపోడు ఆర్గనైజేషన్ సెక్రటరీ పున్నం రామకృష్ణ మాట్లాడుతూ 1976లో ఎమర్జెన్సీ కాలంలో ఎటువంటి కమిషన్ లేకుండా మరియు రాష్ట్రపతి ఆర్డినెన్స్ లేకుండా దొడ్డి దారిన ఎస్టీ జాబితాలో చేర్చారని అన్నారు. తదుపరి ఆదివాసి విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ ఇర్ఫా ప్రకాష్ దొర మాట్లాడుతూ లంబాడీలు వివిధ రాష్ట్రాల్లో ఓసి బిసి ఎస్సి గా చలామణి అవుతూ ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో డినోటిఫై ట్రైబ్ గా చలామణి అవుతూ ఎస్టీ రిజర్వేషన్లు మొత్తానికి ఒక సామాజిక వర్గమే లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. రిజర్వేషన్ల ఉద్యమంలో ఆదిమవాసి యువత ముందు వరుసలో ఉండి హక్కులు రిజర్వేషన్లు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. భద్రాచలంలో సెప్టెంబర్ 28 న జరిగే ఆదివాసి భారీ బహిరంగ సభకు ఆదివాసి తుడుం దెబ్బ, నాయకపోడు గోడ్వాన సంక్షేమ పరిషత్ వివిధ ఆదివాసి సంఘాలు, ఆదివాసి ఉద్యమ నాయకులు,సంఘాల బాధ్యులు పాల్గొని బహిరంగ సభలో ఆదివాసి యువత చర్ల మండల కేంద్రంగా 26 పంచాయతీ ఆదివాసి ప్రజానీకాన్ని చైతన్యపరిచి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆదివాసి జాతి ఐక్యతను చాటి చూపాలని చర్ల మండల జేఏసీగా కోరారు ఈ కార్యక్రమంలో చర్ల మండలం మార్కెట్ కమిటీ చైర్మన్ ఇర్ప శ్రీనివాసరావు, జేఏసీ వైస్ చైర్మన్ వాసం ముసలయ్య దొర,జి ఎస్ పి వర్కింగ్ ప్రెసిడెంట్ పూనెం వరప్రసాద్ ఆదివాసుల జర్నలిస్టుల ఫోరం కనితి భాను ప్రకాష్, ఆదివాసి హక్కుల పరిరక్షణ వేదిక ఇర్పరాజు ఆదివాసి అడ్వకేట్ ఫోరం సీనియర్ న్యాయవాది పార్శిక సోమరాజు దొర గొంది లీల ప్రసాద్ దొర ఎక్స్ ఎంపీపీ గొంది ముయ్యన్న బిరబోయిన శేఖర్ మడకం శేఖర్ పోడియం జగదీష్, కనితి శ్రీను, కనితి జితేంద్ర, మడప భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily