Sunday, 22 November 2026 06:50:28 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

ట్రినిటీలో కొలువుల జాతర.. తరలివచ్చిన వెయ్యి మంది యువత 45 ప్రముఖ కంపెనీల ప్రతినిధులచే ముఖాముఖి ఇంటర్వ్యూలు

నేటి చిన్న ఉద్యోగమే రేపటి గొప్ప భవిష్యత్తుకు పునాది పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 21 November 2026 06:26 PM Views : 53

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ నవంబర్ 21 అక్షరం న్యూస్ పెద్దపల్లి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి బాటలు వేస్తూ పట్టణంలోని ప్రగతినగర్ ట్రినిటీ ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం మెగా జాబ్ మేళా సందడిగా సాగింది. విద్యాసంస్థల వ్యవస్థాపకులు, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో, చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ మేళాకు యువత నుండి విశేష స్పందన లభించింది. సాఫ్ట్‌వేర్, ఫార్మా, ఫైనాన్స్, మేనేజ్‌మెంట్ తదితర రంగాలకు చెందిన 45 ప్రముఖ సంస్థలు ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యాయి. పదో తరగతి నుండి డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ అర్హతలు కలిగిన సుమారు వెయ్యి మందికి పైగా అభ్యర్థులు ఉత్సాహంగా హాజరై తమ ప్రతిభ మేరకు ఇంటర్వ్యూలు ఎదుర్కొన్నారు. ఈ సందర్భంగా దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, పెద్దపల్లి ప్రాంతంలో ఏ యువతీ యువకుడికి ఉద్యోగం లభించినా తమ కుటుంబ సభ్యుడికి వచ్చినంత సంతోషంగా భావిస్తామని పేర్కొన్నారు. ప్రారంభంలో చిన్న ఉద్యోగం వచ్చిందని నిరాశ చెందకుండా అందివచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని, నేటి చిన్న కొలువే రేపటి ఉన్నత భవిష్యత్తుకు బలమైన పునాదిగా మారుతుందని దిశానిర్దేశం చేశారు. నాణ్యమైన విద్యతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే తమ సంస్థ ప్రధాన లక్ష్యమని, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ డాక్టర్ వూట్ల అశోక్ కుమార్, ప్రిన్సిపల్ డాక్టర్ మణి గణేష్, ఎస్ఆర్ యూనివర్సిటీ డైరెక్టర్ డాక్టర్ సమ్మయ్య, ఏవో సురేష్ రాజిరెడ్డి, అధ్యాపకులు, వివిధ కంపెనీల హెచ్‌ఆర్ ప్రతినిధులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :