Tuesday, 17 November 2026 05:40:39 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

వరి, మొక్కజొన్న పంటలను సాగు చేయవద్దు.. వైరా ఏవో మంజూ ఖాన్, డిప్యూటీ ఇంజనీర్ నాగబ్రహ్మం..

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 16 November 2026 05:43 PM Views : 181

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా టౌన్ నవంబర్ 16 (అక్షరం న్యూస్) ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం ఉన్నందున రైతులు వరి, మొక్కజొన్న పంటలను సాగు చేయవద్దని వైరా మండల వ్యవసాయ శాఖ అధికారి మయాంకు మంజు ఖాన్, నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ డిప్యూటీ ఇంజనీర్ వల్లపు నాగబ్రహ్మం సూచించారు. సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ రైతులు అందరూ ఎలినినో ప్రభావం దృష్టిలో ఉంచుకొని నీటి వసతి లేని చోట ప్రాజెక్టు కాలువ పై ఆధారపడి ఎట్టి పరిస్థితులను కూడా యాసంగిలో వరి, మొక్కజొన్న పంటలు సాగు చేయకూడదని తెలియజేశారు. ఎలినినో ప్రభావం వల్ల నీటి వసతి వర్షాభావలు తక్కువ ఉంటాయి కాబట్టి నీటిని తక్కువగా ఉపయోగించుకొని పండే పంటలు పెసర, మినుము కుసుమలు మొదలగు తక్కువ నీటిని ఉపయోగించుకొనే పంటలు మాత్రమే సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు పరిటాల వెంకట నరసయ్య, మేడా రాజేష్, లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ గడిపూడి రామకృష్ణ, ఐలూరు కృష్ణారెడ్డి బిల్లా నరసింహారావు, కోట ఆదాం, మహంకాళి కృష్ణమోహన్ రైతులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :