D SITHA RAMULU, KHAMMAM ...Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ వైరా టౌన్ అక్టోబర్ 10 (అక్షరం న్యూస్) వైరా స్థానిక క్రాంతి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శనివారం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా విద్యార్థులు ప్రకృతితో మమేకమై రంగురంగుల పూలు సేకరించి చక్కటి రూపాలతో బతుకమ్మలను తయారు చేశారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి సునీత మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సౌభాగ్యానికి చిహ్నం అని ఇది తెలంగాణ ప్రజల సాంప్రదాయాలను ప్రతిబింబింప చేసే పండుగని కొనియాడారు. విద్యా సంస్థల డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు జాతి, కుల, మతాల ప్రమేయం లేకుండా ప్రకృతి భాగస్వామ్యంతో మహిళలు జరుపుకునే పండుగ అని పేర్కొన్నారు. విద్యాసంస్థల కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల చైర్మన్ వాసిరెడ్డి సునీత, కరస్పాండెంట్ సంక్రాంతి రవికుమార్ , డైరెక్టర్ సంక్రాంతి సంయోగిత, ఎన్ఎస్ఎస్పిఓ లింగారావు, ప్రిన్సిపల్ కృష్ణారావు, అధ్యాపకులు నాగలక్ష్మి, కల్పన, వేణు.విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily