AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 1/ అక్షరం న్యూస్/ చిట్టి బోతుల వెంకయ్య లక్ష్మీ దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు వేణుగోపాల్ (ప్రధానోపాధ్యాయులు) వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీమ్ విద్యార్థి నిలయమునకు అరక్వింటా బియ్యం మరియు విద్యార్థులకు ఒక పూట భోజనం పండ్లను ఏర్పాటు చేశారు. దాతలు గత కొద్ది సంవత్సరములు వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వనవాసి కి తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ గిరిజన విద్యార్థుల అభ్యున్నతి కొరకు తోడ్పాటును అందిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీమ్ విద్యార్థి నిలయం ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశా లత కార్యదర్శి జవ్వాది మొరళీ కృష్ణ ఉపాధ్యక్షులు గోగికార్ రామలక్ష్మణ్ సహ కోశాధికారి వేములపల్లి ప్రవీణ్ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily