GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ** పెద్దపల్లి ప్రతినిధి, జూలై -05 అక్షరం న్యూస్; వయో వృద్ధుల సంరక్షణ చట్టం పరిధిలోని ఒక కేసు విచారించిన *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* 30 రోజులలో కొడుకు ఇళ్ళు ఖాళీ చేయాలని తీర్పును వెల్లడించారు. *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* సమీకృత జిల్లా కలెక్టరేట్ లో వయో వృద్ధులు సంరక్షణ చట్టం పరిధిలోని కేసు విచారించారు. రామగుండం మండలములోని ఎఫ్.సి.ఐ ప్రాంతానికి చెందిన ఒక వృద్దురాలు తన కుమారుడు తన సంక్షేమం, పోషణ చూసుకోవడం లేదని తనని మానసికంగా వేదిస్తూ భయ బ్రాంతులకు గురిచే స్తున్నాడని, అంతే కాకుండా శ్రీయుత రెవెన్యూ డివిజినల్ అధికారి, పెద్దపల్లి తన కుమారుడిని ఇంటి నుండి ఖాళీ చేయుటకు ఇచ్చినటువంటి ఉత్తర్వులు అమలు జరుగలేదని తెలుపుతూ తన భర్త నిర్మించిన ఇంటి నందు తన మిగిలిన శేష జీవితాన్ని అందులో ప్రశాంతంగా గడపాలని తన కుమారుడిని ఇంటి నుండి ఖాళీ చేపించి తనకు న్యాయం చేయమని కోరుతూ శ్రీయుత జిల్లా కలెక్టర్, పెద్దపల్లి గారికి తల్లిదండ్రులు,వయోవృద్దుల పోషణ మరియు సంరక్షణ చట్టం, 2007 క్రింద దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష,* దరఖాస్తును పరిశీలించి తల్లిదండ్రులు,వయో వృద్దుల పోషణ , సంరక్షణ చట్టం, 2007 క్రింద అప్పీలు గా నమోదు చేసి ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేసి విచారణ జరుపగా అర్జీదారు కుమారుడు అర్జీదారు యొక్క పోషణ, సంక్షేమం సరిగా చూసుకోవడం లేదని అందువల్ల అర్జీదారు మానసికంగా వేదనకు గురిఅవుతున్నాడని తెలిసింది. ఈ విషయములో అర్జీదారు యొక్క కుమారుడికి ఇంటి నుండి ఎందుకు ఖాళీ చేయకూడదో తెలుపుటకు నోటీసులు జారీ చేయగా అర్జీదారు కుమారుడు అట్టి ఇల్లు వారసత్వ సంపద అని అందులో తనకు వాటా కలదని తెలిపినారు. ఈ అంశంలో పూర్తి విచారణ జరిపి తల్లిదండ్రులు, వయో వృద్దుల పోషణ సంరక్షణ చట్టం, 2007 లోని సెక్షన్ (23) , 21(3)(b) నియమం క్రమం అర్జీదారు యొక్క భద్రత, శ్రేయస్సు గౌరవాన్ని పరిగణనలోకి తీసుకొని అర్జీదారు యొక్క కుమారుడిని (30) రోజులలో ఇంటిని ఖాళీ చేస్తూ ఇకపై అర్జీదారునకు ఎటువంటి ఇబ్బందులకు గురి చేయరాదని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు . ఒకవేళ ఇట్టి ఆదేశాలను ఉల్లంఘించినచో చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపినారు. ఇట్టి ఆదేశాల అమలు జరిగేలా చూడాలని జిల్లా సంక్షేమ అధికారి,పెద్దపల్లి , సంబందిత పోలీసు అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడమైనది. జన్మనిచ్చిన తల్లితండ్రుల బాగోగులను చూసుకోవాల్సిన భాద్యత వారి సంతానం పై ఉంటుందని, వారిని నిర్లక్ష్యం చేసిన వారిపై చట్ట రిత్యా చర్యలు గైకోనబడునని కలెక్టర్ తెలిపారు.
.
Aksharam Telugu Daily