GUNNALA PARSHARAMULU, MUSTABAD MANDAL, RAJANNA SIRCILLAReporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / రాజన్న సిరిసిల్ల / ముస్తాబాద్ : రాజన్న సిరిసిల్ల /ముస్తాబాద్ /జులై -15(అక్షరం న్యూస్ ) ముస్తాబాద్ మండలంకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) గా మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం పుట్ట లచ్చాలు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా మండలంలోని సిబ్బంది ఆయనకు ఘనంగా స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు మండలంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు నాయకులు సహకరించాలని అన్నారు .ఇంత వరకు ఎంపీడీఓ గా విధులు నిర్వర్తించిన బీర్ల బీరయ్య వీర్నపల్లి మండల ఎంపీడీఓ గా బదిలీ పై వెళ్లారు
.
Aksharam Telugu Daily