AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్ జిల్లా : * వరంగల్ అక్షరం ప్రతినిధి ప్రతి రోజూ వార్తల్లో సమస్యలు కనిపిస్తాయి… కానీ అరుదుగా మాత్రమే మనసును కదిలించే మానవత్వం కనిపిస్తుంది. అలాంటి మానవత్వానికి చిరునామాగా నిలుస్తోంది సహస్ర ఫౌండేషన్.మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు చిన్నారులు సహస్ర(7), మహావీర్(4)… స్పైనల్ మస్క్యులర్ ఆట్రోఫీ (SMA) అనే అరుదైన వ్యాధితో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న ఈ చికిత్స… ఆ కుటుంబానికి అసాధ్యంగా మారింది.వాళ్లు ఒంటరిగా లేరు… మేమున్నాం” అని ముందుకొచ్చింది సహస్ర ఫౌండేషన్.సంస్థ ఫౌండర్ పాత్తేపు ప్రవీణ్ ఆధ్వర్యంలో… దాతల సహకారంతో రూ.70,000 సాయం సమీకరించి… ఆదివారం వరంగల్ చౌరస్తాలోని డాజిల్ స్పోర్ట్స్ వేర్‌లో చిన్నారుల సమక్షంలో తల్లిదండ్రులకు అందజేశారు.ఈ సందర్భంగా చిన్నారుల తల్లిదండ్రులు కన్నీటి కళ్లతో స్పందిస్తూ…మా పిల్లలకు దేవుళ్లలా వచ్చారు… మా పరిస్థితిలో మీరు చేసిన ఈ సహాయం మాకు కొత్త ఆశ ఇచ్చింది” అని భావోద్వేగానికి లోనయ్యారు.సహస్ర ఫౌండేషన్ సభ్యులు చూపిన చొరవ… అక్కడున్న ప్రతి ఒక్కరి మనసును కదిలించింది.వారి మాటల్లో వ్యక్తమైన ఆ కృతజ్ఞత… సహస్ర ఫౌండేషన్ చేసిన సేవ ఎంత గొప్పదో తెలియజేస్తూ మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపిస్తూ… సహస్ర ఫౌండేషన్ మరోసారి సేవాస్ఫూర్తిని చాటుకుంది.ఈ సందర్బంగా సహస్ర ఫౌండేషన్ ఫౌండర్ ప్రవీణ్ మాట్లాడుతూ.. మేము కేవలం ఒక వేదిక మాత్రమే ఈ సహాయం మొత్తం దాతల పెద్ద మనసు వల్లే సాధ్యమైంది ఒక్కో రూపాయి వెనుక ఒక హృదయం ఉంది ఆ హృదయాలే ఈ రోజు ఈ చిన్నారులకు ఆశగా నిలిచాయి సహస్ర ఫౌండేషన్ పేరు ముందు ఉన్నా నిజమైన హీరోలు మా దాతలే అని దాతలు చూపిన స్పందనకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సహస్ర ఫౌండేషన్ టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily