GOUTHAM REDDY, STATE BUREAU, TELANGANA. Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / కరీంనగర్/ జమ్మికుంట : కరీంనగర్/జమ్మికుంట/సెప్టెంబర్ 07/అక్షరం న్యూస్: జమ్మికుంట మున్సిపాలిటీలో ఓౌట్ సోర్సింగ్ ఉద్యోగి అతి ఉత్సాహం ప్రదర్శించి జమ్మికుంట పట్టణంలోని వైన్ షాప్ ల వద్ద నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ ఎలాంటి రసీదు ఇవ్వడం లేదు. రసీదు ఇవ్వకుండా మీకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన యజమాన్యంపై మునిసిపాలిటీ నుండి జరిమానా విధిస్తామని బెదిరింపులు, మీ షాపు సీజ్ చేస్తావని బెదిరింపులు, ఈ అక్రమ వసూల్ మున్సిపాలిటీ కమిషనర్ కు తెలిసే జరుగుతున్నాయా? లేదా జిల్లా యంత్రాంగం ప్రోత్సాహంతో జరుగుతున్నాయి? అనేది పట్టణవాసుల ? పూర్తి వివరాల్లోకి వెళితే జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గల వైన్ షాప్ లో మునిసిపాటిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి వైన్ షాప్ యాజమాన్యాలను బెదిరింపులకు గురి చేసి తన మనుషులను పంపించి ఎలాంటి రసీదు లేకుండా 20,000 నుండి 25 వేల రూపాయలు రూపాయలు ఇవ్వాలని హుకుం జారీ చేశాడు. వైన్ షాప్ యజమానులు మున్సిపాలిటీ రషీద్ ఇవ్వండి డబ్బుల కోసం వచ్చిన కార్మికుని అడగగా ఔట్సోర్సింగ్ ఉద్యోగి అయిన వ్యక్తికి ఫోన్ కల్పించి ఫోన్లో మాట్లాడి యజమాని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని,ఇవ్వకుంటే నీ యొక్క షాప్ ను సీజ్ చేస్తాం అని బెదిరింపులకు పాల్పడుతున్నాడు. పట్టణంలో జరుగుతున్న అక్రమవాసులు మున్సిపాలిటీ కమిషనర్ , వరంగల్ ఆర్డి లకు తెలిసే జరుగుతున్నాయా? లేక ఔట్సోర్సు ఉద్యోగి ఉన్నతాధికాల కనులు కప్పి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడా? అనేది జమ్మికుంట ప్రజలకు అర్థం కాని ప్రశ్న? ఇప్పటికైనా ఉన్నత అధికారులు ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఉద్యోగుల పైన ఒక కన్నేసి మున్సిపాలిటీ ఆదాయానికి గండిపడకుండా, సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.
.
Aksharam Telugu Daily