Wednesday, 14 October 2026 05:11:56 AM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా ములకలపల్లిలో రాఖీ పండుగ సంబురాలు


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 28 August 2026 05:49 PM Views : 251

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం/ భద్రాచలం : ​భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ మురుకులపల్లి /ఆగస్టు 28 /అక్షరం న్యూస్: అన్నాచెల్లెళ్ల అప్యాయతకు పవిత్ర బంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి వేడుకలు ములకలపల్లి మండల కేంద్రంలో శుక్రవారం అత్యంత వైభవంగా కోలాహలంగా జరుపుకున్నారు. మండల వ్యాప్తంగా ఎక్కడ చూసినా పండుగ వాతావరణం నెలకొనగా అక్కాచెల్లెళ్లు తమ సోదరుల క్షేమాన్ని కాంక్షిస్తూ ప్రేమతో రాఖీలు కట్టారు. ​ఉదయం నుంచే ఇళ్లల్లో సందడి నెలకొంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు నూతన వస్త్రాలు ధరించి ముస్తాబయ్యారు. సోదరుల కుడి చేతి మణికట్టుపై రక్షా సూత్రాన్ని కట్టి నుదుటిన తిలకం దిద్ది మిఠాయిలు తినిపించి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. సోదరులు తమ చెల్లెళ్లకు సదా అండగా ఉంటామని హామీ ఇచ్చి ప్రత్యేక కానుకలు బహుకరించారు. ​పండుగ నేపథ్యంలో ములకలపల్లి ప్రధాన రహదారి ఇరువైపులా కూడళ్లు రంగుల రాఖీలు షాపులతో, మిఠాయి దుకాణాలతో కిటకిటలాడాయి. వివిధ రకాల ఆకర్షణీయమైన డిజైన్ల రాఖీలను కొనుగోలు చేయడానికి మహిళలు యువతులు ఎగబడ్డారు. ఉత్సాహంగా రాఖీ వేడుకలు జరుపుకున్నారు. పండుగ ప్రశాంత వాతావరణంలో ముగిసింది.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :