DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి /కాల్వ శ్రీరాంపూర్ : కాల్వ శ్రీరాంపూర్/పెద్దపల్లి జిల్లా/ డిసెంబర్ 30/ అక్షరం న్యూస్:నూతన సంవత్సర వేడుకలను కాల్వ శ్రీరాంపూర్ మండలంలో శాంతి భద్రతలు భంగం కలగకుండా ఉండేందుకు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కాల్వ శ్రీరాంపూర్ ఎస్సై ఎస్ వెంకటేష్ పత్రికా ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్ట పరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యం సేవించి వాహనం నడిపితే వాహనం సీజ్ చేయడంతో పాటు భారీ జరిమానా మరియు కేసు నమోదు చేపడుతుందన్నారు. మండలంలోని పెగడపల్లి, కూనారం, మోట్లపల్లి క్రాస్ రోడ్, గంగారం ఎక్స్ రోడ్ , కాల్వ శ్రీరాంపూర్ గ్రామాలలో చెక్ పోస్ట్ పెట్టి స్పెషల్ టీమ్స్ తో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ నిర్వహించబడును ర్యాష్ డ్రైవింగ్ బైక్ రేసింగ్‌లు, అతివేగంగా వాహనాలు నడపడం, సైలెన్సర్లు తొలగించి శబ్దం చేయడం నిషేధమన్నారు బహిరంగంగా మద్యం సేవించడం రోడ్లు, పార్కులు, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం నేరమన్నారు.డీజే నిషేధం శబ్ద కాలుష్యం కలిగించే డీజేలు, అధిక శబ్దంతో మ్యూజిక్ సిస్టమ్‌లకు అనుమతి లేదన్నారు.అసభ్య ప్రవర్తన రహదారులపై గుంపులు గుంపులుగా చేరి ఇతరులకు అసౌకర్యం కలిగించడం, అసభ్యంగా ప్రవర్తించడం నేరం.అనుమతి లేని ర్యాలీలు వేడుకలు పోలీసుల అనుమతి లేకుండా ర్యాలీలు, పార్టీల నిర్వహణకు వీలు లేదన్నారు.పబ్లిక్ ప్రాపర్టీకి నష్టం రోడ్ సైన్‌బోర్డులు, స్ట్రీట్ లైట్లు తదితర ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే కేసులు నమోదు చేస్తారు.ఏదైనా ఈవెంట్, పార్టీ లేదా సమావేశం నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు.సైబర్ భద్రత న్యూ ఇయర్ ఆఫర్ల పేరుతో వచ్చే ఫేక్ లింక్స్, కాల్స్‌కు స్పందించవద్దు. బ్యాంక్, ఓటీపీ వివరాలు ఎవరికీ ఇవ్వకండి.మైనర్లకు వాహనాలు ఇవ్వకండి. ఇలాంటి ఘటనల్లో తల్లిదండ్రులపై కూడా చర్యలు ఉంటాయన్నారు.హెల్మెట్, సీటుబెల్ట్ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, నాలుగు చక్రాల వాహనదారులు సీటుబెల్ట్ తప్పనిసరిగా ధరించాలని పోలీస్ తనిఖీలకు ప్రజలు సహకరించాలని తెలియజేశారు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసుకునే కార్యక్రమాలు ప్రజ జీవనానికి భంగం కలిగించే విదంగా ఉంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని.టపాసులు, మైకులు ఎక్కువ సౌండ్ పెట్టి ఎవరిని ఇబ్బంది పెట్టకూడదని డీజే లు నిషేధం, వినియోగిస్తే సీజ్ చేసి, కేసులు నమోదు చేస్తాం.మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం, వాహనాలు ఇష్టానుసారంగా వేగంగా నడిపితే కేసులు నమోదు చేయడంతోపాటు జైలు జైలు శిక్ష విధించబడుతుందని ఇల్లు, ప్రవేట్ ఆస్తులపై, వీధి దీపాల పై రాళ్లు వేయడం, అద్దాలను పగలగొట్టడం, మహిళలను ఇబ్బంది పెట్టిన, అసభ్యంగా ప్రవర్తిస్తే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామనిర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని న్యూ ఇయర్ వేడుకలలో నిషేదిత డ్రగ్స్, గాంజా వంటి మత్తు పదార్థాలు విక్రయించిన, వినియోగించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో క్లోజ్ చేయాలి, మైనర్లకు మద్యం విక్రయించరాదని. బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు పెడతామని.మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే వారికి వాహనాలు ఇచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని, వారి వల్ల ఏదైనా ప్రమాదం చోటు చేసుకుంటే వారి సంరక్షకుల పైన కేసులు నమోదు చేస్తాం. ఈ నూతన సంవత్సర వేడుకుల సందర్బంగా ఎర్పాటు చేసే ఎలాంటి కార్యక్రమాలు అయన సరే నిర్వహకులు తప్పని సరిగా పోలీసు అధికారుల నుండి ముందస్తూ అనుమతులు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు
.
Aksharam Telugu Daily