AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / వరంగల్ జిల్లా ప్రతినిధి : వరంగల్ జిల్లా / వరంగల్ టౌన్ / డిసెంబర్ 18 / అక్షరం న్యూస్ -: నేషనల్ హెరాల్డ్ కేసులో భారతీయ జనతా పార్టీ ఉద్దేశపూర్వకంగా ఎఐసిసి నాయకులు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ పేరు ను చేర్చడంపై బీజేపీ కార్యాలయం ముందు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆందోళన ఉదృతంగా మారింది. వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ అయుబ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన ఉదృతంగా మారింది. కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనతో బిజెపి కార్యాలయానికి వెళ్లే దారి కాంగ్రెస్ కార్యకర్తలతో నిండిపోవడంతో అటుగా వచ్చిన బిజెపి నాయకుడు రాణా ప్రతాప్ రెడ్డి వాహనాన్ని అడ్డుకోవడంతో బిజెపి, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఇరు వర్గాలను శాంతింప చేసిన పోలీసులు అనంతరం ధర్నా స్థలానికి చేరుకున్న వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య నిసరన స్థలానికి చేరుకోవడంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బిజెపి కార్యకర్తపై జరిగిన ఆందోళనను తెలుసుకున్న బిజెపి నాయకులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకోవడన్నీ గమనించిన పోలీసులు జిల్లా అధ్యక్షులు మహామ్మద్ అయూబ్. ఎమ్మెల్యేలు నాగరాజు రేవూరి ప్రకాష్ రెడ్డి తో పాటు ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య ను కాంగ్రెస్ కార్యకర్తలను అరెస్టు చేసి గీసుకొండ పోలీస్ స్టేషన్ తరలించారు. బిజెపి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే హెరాల్డ్ కేసులో పెట్టిన సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీ పేర్లను చేర్చడం అన్యాయమని, స్వాతంత్రం పూర్వం నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను స్థాపించి దేశ స్వాతంత్రం కోసం పోరాడిన యోధుల గురించి ఆ పత్రికలో ప్రజలకు తెలియజేయడం జరిగిందని. కానీ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సోనియాగాంధీ మరియు రాహుల్ గాంధీ పై అక్రమమైన కేసులు పెట్టీ గంటలు తరబడి ఈ. డి ఆఫీస్ లో కూర్చో బెట్టి శూనకాందాం. పొందారు కానీ నిన్న సుప్రీం కోర్ట్ అక్రమంగా పేరు చేర్చారని కొట్టి వేసినారు. ఈ అక్రమ కేసులను పెట్టీనా బి జే పి పార్టీ ని నీలధియాలని రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమం చెప్పాట్టడం జరిగినది. బి జే పి మున్ముందు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టుకోవడం మానాలని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి హెచ్చరించినారు. అదేవిధంగా నిరసన శాంతియుత వాతావరణం లో తెలపడం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు శాసనసభ్యుల మైన మేము వస్తే కర్రలతో రాళ్లతో బిజెపి కార్యకర్తలు సిద్ధంగా ఉండడం రౌడీయిజానికి నిదర్శనమని వర్ధన్నపేట శాసనసభ్యులు నాగరాజు తెలపడం జరిగినది. ఇది రాజకీయ పార్టీలలో మంచి పరిణామం కాదని వారు తెలిపినారు. కార్యక్రమంలో పాల్గొన్న మరొక నేత ఎమ్మెల్సీ బసవరాజ్ మాట్లాడుతూ ఈడీల పేరు ఇలా అక్రమ కేసులు పెట్టి ఆనందపడడం మోడీకి తగదని రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదని జోష్యం చెప్పినారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ రమేష్, కొమరా రెడ్డి , బాబురావు , కార్పొరేటర్ గుండేటి నరేందర్ , కార్పొరేటర్ బసవరాజు శ్రీమాన్ , పిసిసి కార్యదర్శి సౌజన్య , మహిళా అధ్యక్షురాలు నాగపురి నారగోని స్వప్న , కరాట ప్రభాకర్ , జన్ను రవి మరియు వరంగల్ డివిజన్ అధ్యక్షులు జన్ను వివేకు కుసుమ సతీష్ సందీప్ కర్ణాకర్ బొబ్బిలి మరియు సూచన రవీందర్ గోరంట్ల రాజు. మాజీ కార్పొరేటర్ జన్ను రవి , మరియు కాంటెస్టెడ్ కార్పొరేటర్ ప్రవీణ్ మరియు. హుద్దూస్ , ఆజం , 17వ డివిజన్ అధ్యక్షులు సంఘం. మండలం, గీసుకొండ మండల సర్పంచులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసినారు అని వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహమ్మద్ అయూబ్ అన్నారు.
.
Aksharam Telugu Daily