AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల ఆగస్టు 15/ అక్షరం న్యూస్/---వనవాసి కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయం నందు 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.గ్రామీణ వైద్యురాలు సుధారాణి జెండా ను వేగుర వేశారు.ఈ కార్యక్రమాలనికి ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పూజారి కాంకేర్ మాజీ సర్పంచ్ మజ్జి శోభా రాణి విచ్చేశారు. అనంతరం ఆమె విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రెండు వందల యేళ్ళ బానిస సంకెళ్ల నుంచి విముక్తి పొందిన రోజే ఈ రోజు అని ఆమె అన్నారు. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించిన ఎందరో భారతమాత ముద్దు బిడ్డల త్యాగాల ఫలితమే మనం ఈరోజు 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపకుంటున్నామని ఆమె అన్నారు. దేశభక్తికి చిహ్నం మన మువ్వన్నెల జెండా. కాబట్టి ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆమె అన్నారు. అనంతరం విద్యార్థులకు మిఠాయిలను పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశా లత ఉపాధ్యక్షులు గోగికార్ రామలక్ష్మణ్ కార్యదర్శి జవ్వాది మురళీకృష్ణ నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్ బాబు కమిటీ సభ్యులు పోలిన రమాదేవి పున్నమరాజు లలిత రాజేష్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily