AKSHARAM NEWS EDITOR & CHAIRMAN Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/చర్ల : భద్రాద్రి కొత్తగూడెం/చర్ల సెప్టెంబర్ 5/అక్షరం న్యూస్/---- విద్యార్థులు తల్లిదండ్రులతో పాటు గురువులను గౌరవించినపుడే ఉన్నత స్థితికి చేరుకుంటారని వనవాసీ కళ్యాణ పరిషత్ ప్రాంత సహ మహిళా ప్రముఖ్ పెద్దాడ ఆశాలత అన్నారు.వనవాసీ ఆద్వర్యంలో నిర్వహిస్తున్న యువ శిబిరంలో బాగంగా ఉపాద్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం చర్ల లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్దినిలకు ఆశాలత దేశభక్తి గీతం నేర్పించారు. ఆది గురువు నుండి నేటి గురువుల వరకు వారి విశిష్టతను వివరించారు. రామాయణం కాలం నాటి గార్గేయి న్యాయ నిర్ణతగా ఉన్న ఉభయ భారతి గురించి వివరించారు. తల్లిదండ్రులతో పాటు గురువులను గౌరవించాలని అప్పుడే మీరంతా ఉన్నత స్దితికి చేరుకుంటారని బాలికలలో ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో ఉపాద్యాయులు సుమలత నళిని తదితరులు పాల్గొన్నారు.
.
Aksharam Telugu Daily