DOMMATI RAJESH, PEDDAPALLI, TELANGANA.Reporter
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : ... పెద్దపల్లి, ప్రతినిధి ఫిబ్రవరి 3 అక్షరం న్యూస్, పెద్దపల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో రాజకీయ వేడి పెరిగింది. ఫైనల్ అభ్యర్థుల జాబితా విడుదల కావడంతో ఎన్నికల బరిలో మొత్తం 36 వార్డుల్లో కొంతమంది అభ్యర్థులు తమ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో చివరగా 157 మంది అభ్యర్థులు నిలిచినట్లు అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ (బీఆర్ఎస్) మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుండగా, ఏఐఎఫ్‌బీ పార్టీ మధ్యలో బలమైన శక్తిగా ఎదిగి కీలక పాత్ర పోషించే స్థితిలో ఉంది. పార్టీ–వైజ్‌గా చూస్తే కాంగ్రెస్ 36 మంది, టీఆర్ఎస్ 35 మంది అభ్యర్థులతో దాదాపు సమాన బలంతో బరిలో ఉన్నాయి. బీజేపీ 26 మంది అభ్యర్థులతో మూడో శక్తిగా పోటీ చేస్తుండగా, ఏఐఎఫ్‌బీ 23 మంది అభ్యర్థులను నిలిపి పలు వార్డుల్లో గట్టి పోటీ ఇస్తోంది. జనసేన 6, ఏఐఎంఐఎం, సీపీఐ చెరో 3, బీఎస్పీ ఒకరు, ఇతర పార్టీలు 4 మంది అభ్యర్థులను రంగంలోకి దింపాయి. ఇక 20 మంది స్వతంత్ర అభ్యర్థులు ఫలితాలను ప్రభావితం చేసే స్థితిలో ఉన్నారు. వార్డు–వైజ్‌గా పోటీ స్థితిని పరిశీలిస్తే 1వ వార్డు–4, 2వ–7, 3వ–4, 4వ–5, 5వ–6, 6వ–5, 7వ–8, 8వ–5, 9వ–4, 10వ–5, 11వ–3, 12వ–3, 13వ–4, 14వ–4, 15వ–5, 16వ–3, 17వ–4, 18వ–3, 19వ–2, 20వ–4, 21వ–6, 22వ–3, 23వ–4, 24వ–4, 25వ–9, 26వ–6, 27వ–4, 28వ–2, 29వ–4, 30వ–4, 31వ–3, 32వ–5, 33వ–4, 34వ–5, 35వ–3, 36వ–3 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అత్యధికంగా 25వ వార్డులో 9 మంది, 7వ వార్డులో 8 మంది పోటీ చేస్తుండగా, 19వ, 28వ వార్డుల్లో కేవలం ఇద్దరేసి అభ్యర్థులతోనే పోటీ కొనసాగుతోంది. రాజకీయంగా పరిశీలిస్తే కాంగ్రెస్–టీఆర్ఎస్ మధ్య నేరుగా పోటీ కొనసాగుతున్నప్పటికీ, పలు వార్డుల్లో ఏఐఎఫ్‌బీ ప్రభావం ఫలితాలను తారుమారు చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
.
Aksharam Telugu Daily