Admin
అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : " భద్రాద్రి కొత్తగూడెం / కొత్తగూడెం / ఏప్రిల్ 14 / అక్షరం న్యూస్ -: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ అంబేద్కర్ సెంటర్ లో బాబాసాహెబ్ డా.బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. జయంతివేడుకలకు మారపాక రమేష్ కన్వీనర్ గా వ్యవహరించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్.వి.పాటిల్ పాల్గొని మాట్లాడుతూ – "బాబాసాహెబ్ అంబేద్కర్ హక్కులు లేని సమాజంలో హక్కులు కల్పించిన మహాత్ముడు అని ఆయన దారి అనుసరించాలంటే బిడ్డల చదువు కోసం పోరాడాలి. మనందరం సమానత్వంతో, గౌరవంగా బ్రతకడానికి ఆయన రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారు. ప్రతి పౌరుడు ఆయన స్ఫూర్తిని తీసుకుని ముందుకు సాగాలి,"అని పేర్కొన్నారు. ఇక కార్యక్రమంలో మరో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఎస్‌పి రోహిత్ రాజ్ మాట్లాడుతూ – "బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు నిజమైన మార్గదర్శకాలు అని ఆయన కోసం మాట్లాడాలంటే విద్య కోసం మాట్లాడాలి. అంబేద్కర్ ఆలోచనలు, మాటలు నాకు దారి చూపాయి అని నేడు నేను ఈ పదవిలో ఉండగలిగిన దానికి కారణం ఆయన చూపిన మార్గమే" అని పేర్కొన్నారు. అతిథిగా హాజరైన కొత్తగూడెం శాసనసభ సభ్యులు, సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ బావితరాలకు మార్గదర్శకుడైన అంబేద్కర్ ఆశయాల సాధనకోసం ప్రతిఒక్కరు కృషి చేయాలని, ఆయన ఆశయాలకు అనుగుణగా కుల వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వాలపై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జాయింట్ కలెక్టర్ విద్యా చందన, ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య,అంబేద్కర్ జయంతి కన్వీనర్ *మారపాక రమేష్ కుమార్, జే.బీ.శౌరి, మద్దెల శివకుమార్, కూసపాటి శ్రీనివాస్, న్యాయవాది యెర్రా కామేష్, మంద హనుమంతు* తదితరులు పాల్గొన్నారు..
.
Aksharam Telugu Daily