Saturday, 18 April 2026 02:15:48 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అదనపు ఆదాయం ఉపాధి అవకాశాలు పెంచేలా మోడల్ డెమో ఫామ్ : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 28 August 2025 06:00 PM Views : 652

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రికొత్తగూడెం/బూర్గంపహాడ్ : *.* భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ బూర్గంపాడు, అక్షరం న్యూస్/ ఆగస్టు 28: జిల్లా లో ప్రజలకు అదనపు ఆదాయం మరియు ఉపాధి అవకాశాలు పెంచేలా మోడల్ డెమో ఫామ్ ను రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. గురువారం బూర్గం పహాడ్ మండలం మొరంపల్లి బంజర గ్రామపంచాయతీ పరిధిలోని కెనాల్ పక్కన ఉన్న నీటిపారుదల శాఖ భూమిలో నూతనంగా ఏర్పాటు చేయు మోడల్ డెమో ఫామ్ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మోడల్ డెమో ఫామ్ ను ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దానిపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ డెమో ఫామ్ లో కూరగాయల సాగు, మట్టితో ఇటుకల తయారీ యూనిట్, వెదురు మరియు వాక్కాయ కంచె, క్వాయిల్ యూనిట్ షెడ్ మరియు సోలార్ డ్రైవర్ ఏర్పాటు చేయడంతో పాటు మునగ చెట్లు పెంచే విధంగా ప్రణాళికలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ మోడల్ డెమో ఫామ్ ద్వారా రైతులకు మాత్రమే కాకుండా మహిళలకు కూడా ఉపాధి అవకాశాలు కలగడం, సరికొత్త వ్యవసాయ పద్ధతులు పరిచయం కావడం ద్వారా అదనపు ఆదాయ వనరులు అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ బి ఎన్ ప్రసాద్, ఆర్ ఐ నరసింహారావు, ఎస్సార్ఎల్పి ఏఈ సందీప్, ఎంపీ ఓ బాలయ్య, ఏపీఓ విజయలక్ష్మి, ఏపీఎం హేమంతిని, పంచాయతీ సెక్రెటరీ భవాని, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :