Wednesday, 08 July 2026 11:26:11 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

జనసేన పార్టీ ఆత్మీయ సమావేశాన్ని దిగ్విజయం చేద్దాం..

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 08 July 2026 05:20 PM Views : 28

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాద్రి కొత్తగూడెం/ జూలూరుపాడు/జులై 08/అక్షరం న్యూస్: ఈ నెల 12 వ తేదీన జరిగే జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం విజయవంతం చెయ్యాలి కోరుతూ బుధవారం నాడు మండల కేంద్రంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ఉసికల రమేష్ ఆత్మీయ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఈనెల 12వ తారీఖు ఆదివారం నాడు కొత్తగూడెం విద్యానగర్ శ్రీరామ ఫంక్షన్ హాల్ నందు జరిగే కార్యక్రమానికి జనసేన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్, జనసేన పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్, అల్లాడి తనీష్ వస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు జనసేన పార్టీ లో జాయిన్ అయినా తర్వాత మొట్ట మొదటి సారిగా భద్రాద్రి కొత్తగూడెం విచ్చేస్తున్నారు.ఎంతోమంది పేదలకు జి ఎస్ ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా వైద్యం అందించి, గొప్ప సేవలు అందించిన మహానుభావులు డాక్టర్ గడల శ్రీనివాసరావు అటువంటి నాయకులకు మనమంతా అండగా ఉండి మరెన్నో సేవా కార్యక్రమాలను వారి ద్వారా పేదలకు అందేలా మన జన సైనికులమంతా తోడుగా నిలబడదాం కావున పార్టీ నాయకులు, జనసైనికులు , వీర మహిళలు, పార్టీ అభిమానులు రాష్ట్ర నాయకులకు స్వాగతం పలుకుతూ ఆ రోజు జరగబోయే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మరియు ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరి పైన ఉంది కావున జనసేన పార్టీ జన సైనికులకు,వీర మహిళలకు ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చెయ్యాలని జనసేనికులకు,అభిమానులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల నాయకులు చలమల విజయ్, పోరేటి జోగారావు, గణప సాయి, ఉదయ్ మరియు జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :