Friday, 10 July 2026 11:39:52 PM
 Breaking
     -> ఇక ఇథనాల్-బ్లెండెడ్ పెట్రోల్ తప్పనిసరి ..      -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

మంథని ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం మద్యం మత్తులో బొలెరో డ్రైవర్ బీభత్సం

ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు పలువురికి గాయాలు


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN

Admin

Date : 10 July 2026 06:19 PM Views : 58

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / పెద్దపల్లి : పెద్దపల్లి టౌన్ జూలై 10 అక్షరం న్యూస్ పెద్దపల్లి జిల్లా మంథని ఫ్లైఓవర్‌పై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మద్యం మత్తులో బొలెరో వాహనం నడుపుతున్న డ్రైవర్ అదుపు తప్పి ముందుగా వెళుతున్న ఆటోను ఢీకొట్టి, అనంతరం ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురితో పాటు పలువురికి గాయాలయ్యాయి. సుల్తానాబాద్ నుంచి ఓడేడు వైపు వెళ్తున్న వాహనంలో ప్రయాణిస్తున్న ఓడేడుకు చెందిన రామగిరి వెంకటలక్ష్మి, మొండయ్య, రామకృష్ణలకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణాపాయం తప్పి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న కమాన్‌పూర్ 108 అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం కారణంగా మంథని ఫ్లైఓవర్‌పై సుమారు గంటపాటు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. మద్యం మత్తులో వాహనం నడిపిన బొలెరో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :