Saturday, 07 February 2026 06:19:58 AM
 Breaking
     -> భద్రాచలం క్రాస్ రోడ్ వద్ద కేఎల్ఆర్ కళాశాల బస్సు బోల్తా – ..      -> టీజీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు : ..      -> గురుకుల పాఠశాల కిన్నెరసానిలో  స్వర్ణోత్సవ  ర్యాలీ :        భారీగా హాజరైన జనం.....      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల స్వర్ణోత్సవాలు :..      -> డిసెంబర్ 28న జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయ వంతం చేయండి   :రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రవర్తి, రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఖాదర్......      -> గోదావరి నది పరివాహక లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : అత్యవసరమైతే వెంటనే 100 కు ఫోన్ చేయండి : ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ ..      -> కిన్నెరసాని గురుకుల పాఠశాల  స్వర్ణోత్సవా లను ఘనంగా నిర్వహించాలి  - రిటైర్డ్ ఉపాధ్యాయులు చక్రధర్  :..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన   ఎస్ఆర్ విద్యార్దినులు  :..      -> నేడు ఇంటర్ ఫలితాలు : -ఫెయిల్ అయినా, మార్కులు తక్కువ వచ్చిన ఇది చివరి అవకాశం కాదు.....      -> జేఈఈ మెయిన్స్ -2025 ఫలితాల్లో  ఆల్ ఇండియా 141 ర్యాంక్  వెంకట్ కౌశిక్ : ..      -> ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన నెల్లూరు ఎస్ఆర్ విద్యార్థులు :ఎంపీసి విభాగంలో ఏ. నిహారిక  991 మార్కులు సాధించి  స్టేట్ ర్యాంకు....

అభ్యర్థుల చేతికి ‘బీ-ఫామ్‌’.. ప్రచారానికి ‘శ్రీకారం’. ఏదులాపురం మున్సిపల్ పోరులో ‘హస్తం’ దూకుడు.. బీ-ఫామ్‌లు అందజేసి...అభ్యర్థులకు దిశానిర్దేశం చేసి

.


D SITHA RAMULU, KHAMMAM ...

Reporter

Date : 03 February 2026 06:59 PM Views : 264

అక్షరం తెలుగు డైలీ - ప్రాంతీయ వార్తలు / ఖమ్మం జిల్లా : ఖమ్మం/ స్టాఫ్ రిపోర్టర్ ఫిబ్రవరి 3 (అక్షరం న్యూస్) ఏదులాపురం : ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల సమరంలో కాంగ్రెస్ పార్టీ కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంగళవారం అభ్యర్థుల చేతికి *బీ-ఫామ్‌* లు అందజేశారు. దీంతో మున్సిపల్ కోటపై ‘హస్తం’ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా ప్రచార పర్వం ఊపందుకుంది. *గెలుపే లక్ష్యంగా గడప గడపకూ..* బీ-ఫామ్‌లు అందుకున్న అభ్యర్థులు వెంటనే ఎన్నికల అధికారులకు నామినేషన్లు సమర్పించాలని మంత్రి సూచించారు. "అధికారికంగా బీ-ఫామ్‌లు అందాయి.. ప్రభుత్వ ప్రజారంజక పాలనను, అమలు చేస్తున్న గ్యారంటీలను వివరించి ఓటర్ల ఆశీస్సులు పొందాలని పిలుపునిచ్చారు. *క్లీన్ స్వీపే టార్గెట్!* వార్డుల వారీగా కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, ప్రత్యర్థుల వ్యూహాలను చిత్తు చేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. ఏదులాపురంలోని అన్ని వార్డుల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మంత్రి చేతుల మీదుగా బీ-ఫామ్‌లు అందుకున్న అభ్యర్థులు రెట్టింపు ఉత్సాహంతో ప్రచార క్షేత్రంలోకి అడుగుపెట్టారు.

.


AKSHARAM NEWS EDITOR & CHAIRMAN
7893003409
Editor : sk. Yakub pasha 7893003409

Aksharam Telugu Daily

మరిన్ని వార్తలు

Copyright © Aksharam Telugu Daily 2026. All right Reserved.

Developed By :